కొరవే ఆధ్వర్యంలో ప్రపంచ మాతృభాషా దినోత్సవ సత్కారాలు

 ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం, కొత్తూరు రచయితల వేదిక ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన వార్కి ఘనంగా సన్మానించారు. స్థానిక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల ఆవరణలో కొత్తూరు రచయితల వేదిక 11వ నెల సమావేశంలో ఈ సత్కారాలు జరిగాయి. వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు మాట్లాడుతూ సంఘంలో ప్రజలు తమ భావాలను అర్థవంతంగా ఎదుటి వారికి తెల్పగల ప్రధాన వాహిక మాతృభాష అని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సామాజికవేత్త జంక వెంకటరావు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు జీవద్భాషలా మాతృభాష దోహదపడుతుందని అన్నారు. గౌరవాధ్యక్షులు పెధ్ధిన కులశేఖర ఆల్వార్ మాట్లాడుతూ శారీరక మానసిక వికాసాలకు మాతృభాష అనేది జీవధార వంటిదని, తెలుగు పద్యాలు గద్యరచనలు వచనకవితలు వింటుంటే మన మాతృభాష ఔన్నత్యాన్ని ఆస్వాదించగలమని అన్నారు. విశిష్ట అతిథి జి.జయలక్ష్మి మాట్లాడుతూ పదకొండు నెలలుగా కొత్తూరు రచయితల వేదిక సభ్యులంతా ఎంతో ఘనమైన సాహిత్య సేవలు నిర్వహించుట మిక్కిలి అభినందనీయమని అన్నారు. ఈ వేదికపై ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని మండలస్థాయిలో తెలుగు సబ్జెక్టులో ముందంజలో ఉన్న కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలిక ఆరి హస్మిత, బలద ఉన్నత పాఠశాల బాలిక యం.హారిక, కడుము మెట్టూరు విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాలల బాలబాలికలైన లక్ష్మీ ప్రసన్న,  ద్రాక్షాయణి, జాను, చేతనలను ప్రశంసిస్తూ ప్రోత్సహక కానుకలను బహూకరించారు. అలాగే ఇటీవల గుంటూరు ప్రపంచ తెలుగు మహాసభలు, పార్వతీపురం మన్యం జిల్లా పుస్తక మహోత్సవం, శ్రీకాకుళం శ్రీశ్రీ కళా వేదిక, విజయవాడ తదితర జాతీయ సాహిత్య వేదికలందు గౌరవ పురస్కార సత్కారాలొందిన, వివిధ సంకలనాలనందు రచనలతో కీర్తినొందిన కొత్తూరు రచయితల వేదిక సభ్యులు పెద్దిన కులశేఖర ఆల్వార్, అమ్మల కామేశ్వరి, గేదెల మన్మధరావు, ముదిల శంకరరావు, గడసాపు ఉషారాణి, కె.శ్రీరాములు, అల్లిన వెంకట రమణ మూర్తి దిలీప్ రాజా పట్నాయక్ లకు అతిథులు జంక వెంకటరావు, జయలక్ష్మి దంపతులు శాలువాలు కప్పి ఘనంగా ప్రపంచ మాతృభాషా దినోత్సవ సన్మానాలు గావించారు.
అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు, ఉపాధ్యక్షులు ముదిల శంకరరావు, ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి, సహ కార్యదర్శి గడసాపు ఉషారాణి, గౌరవాధ్యక్షులు పెద్దిన కులశేఖర ఆల్వార్, కోశాధికారి వైశ్యరాజు హరనాథరాజు, కార్యవర్గ సభ్యులు బాణాల రమణమూర్తి, గజివిల్లి మోహనరావు, పెరిశెట్టి రామచంద్రరావులు తమ స్వీయ కవితలు వినిపించారు. అనంతరం కవితలు వినిపించిన వారందరికీ అతిథులు వెంకటరావు జయలక్ష్మి దంపతులు ఘనంగా సన్మానించారు. తొలుత కవులందరూ తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాలాలంకరణ చేసారు. మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు