విశాఖపట్నం పౌరగ్రంధాలయంలో ప్రముఖ సాహితీ సంస్థ సహృదయ సాహితీ నాలుగుదశాబ్దాల సాహితీ వేడుకలను సంస్థ అధ్యక్షులు కవి రచయిత శేఖరమంత్రి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సాహితీవేత్త ఆచార్య దామెర వెంకట సూర్యారావు, కవి వేదుల శిరీష గారు కవులు చిన సూర్యనారాయణ, గజల్ రచయిత చల్లా రాంబాబు ఆచార్య విజయ్ గోపాల్
ముఖ్య అతిధి సెంచూరియన్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి. ఎస్. ఎన్. రాజు గారి సమక్షంలో విశిష్ట అతిధి ప్రముఖ సాహితీవేత్త బ్రహ్మశ్రీ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు స్వహస్తాలతో కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ ని ఘనంగా సత్కరించి ఆశీస్సులు అందించారు. బదులుగా ప్రసాద్ మాష్టారు తెలుగు రాష్ట్రాలలో ప్రతివారం సాహితీ సభలు నిర్వహించే ఏకైక సంస్థచే మరియు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారిచే జరిగిన సత్కారం జీవితాన మరువలేనిదని సంతోషం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి