****
అవ్వా! గీ యిష్యం తెల్సా! మనూల్లెకి ఓ ముసలవ్వొచ్చింది..
"అవునా శెల్లె ఎవలింటికొచ్చింది? ఎవలి సుట్టపామె?"
"ఎవ్వలి సుట్టం కాదవ్వా! నిన్న పగిటీలప్పుడు గుడితాన ఒక్కతే కూసోనుంది.గటేపు పనిమీద ఎల్తూ సూశిన. ఎప్పుడు సూశిన మొగంలా లేదు. ఎవలింటికొచ్చిందో ఆరా తీద్దామని గా యవ్వతానకెల్లిన. నన్ను సూడంగనే పానం లేచొచ్చినట్టయ్యిందేమో"బిడ్డా! నాల్కారి పోతాంది.గిన్ని నీళ్ళు తెచ్చి ఇత్తవా? లేత్తె కండ్లు తిరుగుతాన్నయి." అంది.
"అయ్యో అన్పిచ్చి సర్ర సర్ర బొయ్యి గుడెదుర్గుండ కొట్లెకెల్లి సీసెడు నీళ్ళు బట్కొచ్చి ఇచ్చిన. పాపం ఎంత దూపగుందో ఏమో గట్టగట్ట సీసెడు నీళ్ళు తాగిందవ్వ. గీ నీళ్ళు గనక తాగక పోతే నాల్కె గుంజకబొయ్యి సచ్చేదాన్ననంది.
ఏం పనిమీద గీడకొచ్చినవని అడిగే తల్కి కండ్ల నీళ్ళు పెట్టుకుంది.గీ గుల్లె మొక్కుందని కొడుకు తీస్కొని వొచ్చిండు.ముడుపేదో మర్శిన గద్దీసుకొత్తనని తెల్లారగట్ల గా శెట్టెనక కూసబెట్టి పొయ్యిండు.గక్కడ కుక్కల మందని జూసి బయపడి గీడొచ్చి గూసున్న అంది.
అయ్యో పాపం? ఏవన్న తిన్నదటనా శెల్లె?తింటానికి ఏవన్న తెచ్చుకుందా?
"గస్మంటి ఆనవాల్లేవీ కన్పడలేదవ్వా? గందుకే గుల్లె అయ్యోరు బెట్టే పసాదమైన తిన్నవా అవ్వా? అని అడ్గిన.
"తల్కాయ దించుకొని కొడకసలే ముడ్పు శెల్లిచ్చుకోవాలని చెప్పిండు.గాడొచ్చినంక తింటనని గట్లే కూసుందటవ్వా.
గందుకే తిండి నీళ్లు లేక శోషొచ్చినట్టుంది. గిన్ని నీళ్ళు తాగినంక తేర్కొని గీ యిష్యాలు జెప్పింది.
"అయ్యో! అసలే ముసలి పానం అంటున్నవ్! ఆకల్కి తట్టుకోలేక ఏమన్న గాదు కద?
"గందుకే అవ్వా! మల్ల సర్ర సర్ర బొయ్యి చాయ్,బన్ను తెచ్చి తినేదనక పట్టుబట్టి కూసుంటే గప్పుడు తిన్నది.కొడుకొత్తడని చనచనానికి దిక్కులు జూస్కుంట ఎదురుచూస్తున్నది. ఇంట్లెకు బోదామంటె కొడుకొచ్చి సూశేతల్కి నేను లేకబోతే అయిరాన బడ్తడు,పరేషాన్ అయితడు అంటుందవ్వా!"
ఎంత పిచ్చితల్లేం శెల్లే! గాడు తల్లిని వొదిలిచ్చుకోడానికే ఎవ్వలు లేవక ముందు గీడ వొదిలేసి పోయిండు.ఇంగేడ వొత్తడు.శేతిల సంచి బొంచి ఏమైన ఉందా శెల్లె! గింతకి ఏవూరో గదన్న శెప్పిందా?"
"పడమటి దిక్కున ఏదో పల్లెంట అవ్వా? పది గంటలు పైనే బట్టిందంట గీడకి రాడానికి.శేతిల ఏం లెవ్వు.పెయ్యిమీద గా శిరుగులు బడ్డ శీరె తప్ప.ఇగ్గో ఇంటికాడికెల్లి అన్నం వొండుకొచ్చిన. గిట్లనే యిష్యమంత నీ శెవిల సుత ఏద్దామనే వచ్చినవ్వా!"
అవునా శెల్లె! నేను సుత సూడ్డానికి వత్త పా. "అన్నం బెడ్తే అరగడియల అరుగుతుంది.ఆదరిత్తే శాశితంగ ఉంటుంది".గిప్పుడు అన్నమే గాదు గా యవ్వను ఆదరించాలే! పా అని తొందర బెట్టింది.
ఇద్దరూ గా ముసలవ్వ తానకి బోయిండ్రు. కొడుకు పోను నెంబరు ఇచ్చిండాని అడిగిండ్రు."ఏమియ్య లేదు. ఒంటి మీద బంగారముంటే పయానంల దొంగలెత్కబోతరని మెల్ల గొలుసు,శెవి దుద్దులు సుత దాత్తనని తీసుకుండని శెప్పే తల్కి అవ్వకీ,శెల్లె జోగమ్మకి అర్తమైంది.గా యవ్వ కొడుకు కావాలనే ఊరుగాని ఊల్లే దిగబెట్టి బోయిండని.
మొదగాల గా యవ్వను మా ఇంటికి తోలుకొత్తనని అవ్వ ఇంటికి దెచ్చుకుంది.
గదండీ సంగతి! "అన్నం బెడ్తే అరగడియల అరుగుతుంది-ఆదరిత్తే శాశ్వతంగా ఉంటుంది" అంటే గిదే మరి.గట్లాంటి దుష్ట సంతానం ఉన్న గీ లోకంల అవ్వ,శెల్లె లాంటోళ్ళు ఉండబట్టే మంచితనం ఇంకా బతికుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి