పదహారేళ్లకే ఏంటో ఆమె హీరోయిన్
పంతొమ్మిది ఏళ్లకే ఏంటో అతడు హీరో
పది హెడు ఏళ్లకే అతడే హీరోకి దోస్తుడోలే
అరచేతిలో దొరికిన ఇంస్టాగ్రామ్ ప్రేమ విచిత్రమే
అవును ప్రేమ గుడ్డిదని నిరూపించింది
అవును గుడ్డి ప్రేమ ప్రపంచాన్ని ముంచినది
కన్నతల్లిని హతమార్చిన సంఘటన ఇది
కన్న పాపానికి ప్రాణం తీసే కసాయి కూతురిది
పుస్తకాలు కుస్తీ పట్టాల్సింది మరిచి
మస్తీస్కానికి దోస్త్ కట్టే మత్తు ప్రేమే
కాస్త ప్రేమకు కన్న బంధం విలువ మరిచే
ప్రేమకు విమానమంత రెక్కలొచ్చి హత మార్చేనే
తప్పోప్పులకు ఎదురు తిరిగితే
విలన్ పాత్ర తల్లిదే మరీ...
ఆకర్షణ మొగ్గప్రాయంలో తుంచకుంటే
యవ్వనం కాటేస్తుంది మరీ...
ప్రేమకు కొత్తగా రెక్కకొచ్చి కన్న పేగును తెంపే
ఉడుకు రక్తమై ప్రేమ మైకం చుట్టు ముట్టి
పాములా చుట్టూ మెలేవేసి కాటు వేసే
మరి యవ్వనం కాటేస్తుంది ప్రేమ మత్తులో..
అవును ప్రపంచం మరిచిన ప్రేమ గుడ్డిది
అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మరీ...
సమాజాన్ని మనసు పొరలతో కప్పివేస్తుంది
కొత్తగా రెక్కలు వచ్చి ప్రయాణిస్తూ ఉన్నది
అవును ఎప్పుడు ప్రేమ గుడ్డిది
మంచి కోరే రక్తసంబంధం ఏప్పుడు చెడ్డది
నమ్మకద్రోహం చేస్తేనే అసలు ప్రేమ తెలిసేది
ప్రేమ ఆస్తి అంతస్తులు చూడక పప్పులో కాలు వేస్తది
సాగేకాలంలో జీవితం అనుభవం తెలిశాక
మనసు పొరల్లో యవ్వనం మసకబారే
ప్రేమ పేరుతో వృధా చేసిన ప్రతి నిమిషమే
నడుస్తున్న జీవిత ప్రయాణంలో గుండెను పొడిచే.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి