బంధం ధన దాహంతో స్వార్ధంగా పరుగులు తీసే
ధాత్రిలో మేడి పండు సొగసులతో ఉరకలు వేస్తూ....
మనిషి 100 ఏళ్లకే చావే లేదన్నట్టుగా.....
వేళల్లో ధనాన్ని పోగేస్తూ కోట్లల్లో కుమ్మరిస్తూ.....
ఇది మాయ మనసుల నైజం సుమా!!!
బంధం ఏదైనా బతకటానికి చేస్తున్న ముసుగు తప్పిదం?
కనుల ముందు ఎనలేని ప్రేమను కురిపిస్తునే
కండ్లు మూసి చీకట్లో ఊసరవెల్లి అయ్యి కనుమరుగాయే
ధనం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలే ముసురితే...
దరిద్రం ఉన్నప్పుడు నీచమైనా చూపులే విసురుతూ...
మనిషికి స్వార్థం ఎక్కువ కాబట్టే అపార్ధాలే
ఎదుగుదలను ఓర్వలేక ఇతరుల్ని వేలు పట్టి
మరీ చూపుతూ కుళ్ళు కుతంత్రం స్వభావం కలిగే
మిగిలిన నాలుగు వేళ్ళు తన వంకే చూస్తున్నాయని
గుర్తించలేదు? కానీ గొప్పలు తెప్పలుగా చెప్పు కుంటూ.... కంటూ...అంటూ....
కష్టాల్లో ఉన్నప్పుడు కపట ప్రేమ చూపిస్తూ?
కనికరం ఉన్నట్లు తెగ నటిస్తూ?
ఏదో సాధించినట్లు గొప్పలు పోతాయి?
అసలు మానవత్వం లేని కపట బంధాలు చూపుతే
అందుకే కుటుంబ బంధాలు వడి వడిగా విడిపోతూ...
స్నేహ బంధాలు అబద్దాల ముసుగులో తెగిపోతూ..
ప్రేమ బంధాలు గుండెలు పగిలేలా దూరమవుతూ ....
ఏ బంధమైనా నిలుపుకొనే నమ్మకం పైనే ఆధారపడే
అక్షరాస్యుడైన నిరక్షరాస్యుడైన మేడిపండు
బంధాలే అడుగడుగునా...
ఇతరులపై ఏడ్చుకునే మలిగినమే
పాడు మదినా...... గుణం ఊసరవెవెళ్ళిలా
అనుబంధాలు అడుగడుగునా!
కనుమరుగవుతున్న బంధాలు
కాటికి పోయిన అసలు మారవు
డబ్బుకున్న విలువ మనిషి బంధాలకు అసలే ఉండదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి