వికసితసరోజం: - డా.సి.వసుంధర చెన్నై
వేదజ్ఞానరస     పూర్ణ, 
భారతనామ సరస్సులో విరిసె 
నొక సరోజం.
 
గాలికి కుల మతాల భేదం లేదని, బెంగాలీ పట్టిందొకనాయుడి 
హస్తం.  ఆమే  మన సరోజినీ అయింది సరోజీనినాయుడు.
12ఏటీకే హైస్కూల్గడపదాటి 
అయింది విదేశీ చదువుల మేటి.
గాంధీజీకి ప్రియ భారతకోకిల,కవిలోకపు కమ్మని గాన వనప్రియచయము.
రాసింది హృదయంతో,పాడింది పరవశంతో.
హైదరాబాద్ అంగళ్లగూర్చి, పల్లె పిల్ల పెళ్లిళ్లగూర్చి
ప్రకృతి అందాల గూర్చి ఆకాశాన వేలాడే తరుణ బింబాన్ని గూర్చి 

 అడుగెట్టింది గట్టిగా తనకుతానే ధీటుగా
జాతీయ ఉద్యమ చరిత్రలో తనకంటూ కొన్ని 
పుటలు ఏర్పరచుకుంది. 

కాన్పూర్ కాంగ్రెస్ సభకు
  తొలి మహిళా అధ్యక్షురాలు,
తొలి మహిళా గవర్నర్ ఇలా తన సత్తా చాటుకుంది. 
కవయిత్రిగా, గాయనిగా, జాతీయ ఉద్యమ నాయకురాలుగా, ప్రకృతి ఆరాధకురాలిగా, గాంధీకి ప్రియ శిష్యురాలిగా చరిత్రలో చెదరని ముద్ర వేసుకున్న సముద్రమంత
సమన్నత వ్యక్తిత్వం కల వనితారత్నం, ఆమే మన భారతీయ స్త్రీ జాతి విముక్తి ప్రదా త  సరోజినీమాత.

కామెంట్‌లు