కొత్తూరు రచయితల వేదిక గౌరవాధ్యక్షులు, సామాజికవేత్త పెద్దిన కులశేఖర ఆల్వార్ ను, రాజాంలో రాజాం చరిత్ర పుస్తక బహూకరణతో సత్కారం జరిగింది. రాజాం ఎస్.ఆర్.ఫంక్షన్ హాల్లో లోలుగు సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన కులశేఖర్ కు, రాజాం రచయితల వేదిక సభ్యులు, శతాధిక వ్యాసకర్త పిల్లా తిరుపతిరావు చేతులమీదుగా ఈ సత్కారం లభించింది. నగర రాజం రాజాం అనే ఈ సంపుటిని రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం రచించిరి. ఆరేళ్లుగా ఆయన రాజాం చరిత్రను సేకరించుటకై శ్రమించిరి. బొబ్బిలి రాజులతో కూడిన రాజాం చరిత్ర కావడంతో మిక్కిలి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పుస్తకం ఆవిష్కరణతో పాటు అనేక కార్యక్రమాలు ఈ వేదికపై నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిన కులశేఖర ఆల్వార్ మాట్లాడుతూ గార రంగనాథం కృషి నేటి యువతకు, రాబోవు తరాలకు ఘనమైన స్పూర్తినందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
కులశేఖర్ కు రాజాం చరిత్ర పుస్తకం బహూకరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి