ప్రేమ....! ; - కోరాడ నరసింహా రావు!
నేను బడికి పోతున్న కొత్త ల్లో....
   అమ్మ చక్కగా స్నానం చేయించి... 
    నవ్వుతు చద్ది బువ్వ తినిపించి , రేవు బట్టలు వేసి, 
  ముఖానికి పౌడరు రాసి తల దువ్వి ...
  నవ్వు ముఖంతో నను చూస్తూ... 
   నా నుదుటి పై ముద్దు పెట్టి... 
  బాగా చదువుకో నాన్న అంటు... నవ్వుతూ మెరిసే కళ్లతో నన్ను బడికి పంపేది...! 
   అప్పట్లో అది తల్లి ప్రేమని నాకెలా తెలు స్తుంది....!? 
  
క్లాసులో  నా పక్కనే కూచునే భాషా... 
   చిరునవ్వుతోనా వంక చూస్తూ.... 
 చాక్లెట్ నా చేతికిచ్చినది మొదలు...రోజు రోజు కీ మా స్నేహం పెరిగి .... 
   ఏ రోజు వాడు బడికి రాక పోయినా... 
   యేదో దిగులు , ధ్యాస చదువు మీదికి మల్లేది కా దు...! 
   అప్పట్లో అది స్నేహముతో కూడు కున్న ప్రేమో... 
  ప్రేమతో ఏర్పడ్డ స్నేహమో... ! 
  ఇ వే వీ  నాకు తెలియవు...! ! 

నాన్న సర్కస్ .... 
అనాగానే...., 
   తను పనిలో వేసుకునే బూట్లు బాగా చిరిగి పోయాయని... బూట్ల కోసం దాచిన వెయ్యిరూ పాయలు ఖర్చు పెట్టేసి...
  సర్కస్ లో నా ఆనందా న్నిచూస్తూ మురిసి పోయే నాన్నది బాధ్యతో , ప్రేమో
 అప్పట్లో నా కేం తెలు స్తుంది....!! 
  
యవ్వనంలో... పక్కింటి ఉషా ను పదే పదే చూడా లని, మాట్లాడాలని తహ తహ... 
   ఇది మోహమో ప్రేమో... 
అప్పట్లో దీన్ని ప్రేమే అనుకునే వాడ్ని...! 
  ఆమెకు పెళ్లై వెలి పోయిన తరువాత నెమ్మ
నెమ్మదిగా  అలా... పూర్తిగా మరచి పోయాను
 ఇది ప్రేమా...?! 

అనురాగపు అమ్మది ప్రేమ
  తన అవసరాలను పక్కన పెట్టి... 
  పిల్లల ఆనందానికై పాటు పడే తండ్రిది ప్రేమ 
   లోక జ్ఞానం తెలిసిన తరువాత కాదు...కల్మష మెరుగని బాల్యంలో చేసే స్నేహంలో
 ఒకరిపై ఒకరు చూపిం చేది... నిజమైన ప్రేమ ! 

యవ్వనంలో కాదు... 
    వయసు మల్లిన తరువాత కష్ట, సుఖాలలో
  ఒకరినొకరు సహకరించు కునేదే నిజమైన ప్రేమ...! 

తన పర.... తర తమ  భే దం చూడక... 
  ఎదుటి వారి కష్టానికి కరిగి పోయేదే నిజమైన ప్రేమ! 
  తోటి మనిషి అభివృద్ధికి ఆనందించేదే నిష్కల్మష మైన ప్రేమ...!! 

అంతే కా నీ... 
  యవ్వనపు వేడిలో... పరస్పర కామ దాహం ప్రేమ కాదు...! 
 అది మోహం...! 
వ్యా మోహం...!! 
  కామ-వ్యామోహాలకు ప్రేమ అని పేరు పెట్టి... 
  హత్యలు,ఆత్మహత్యలు
 మూర్ఖత్వం....! 
      ******

కామెంట్‌లు