సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం.
 సామెత -147: -అయినోడు కాలు దువ్వితే కాని వాడు మీద పడ్తడు
****
బాగనే ఉంది కత.మడిషి మీద గింత గనం వలపచ్చమా?గా లెక్కలు గీ లెక్కలని జెప్పి గా అమాయికున్ని ఆత్తిలో అన్నేలం జేసిండ్రు.పాడు లోకం రకత సంబందం లేదు ఏం లేదు.ఆత్తుల తాన కొచ్చే తల్కి అంతా పరాయోల్లే.ఎటు పోతుందో గీ లోకం.గియ్యన్నీ కట్టకట్టుక పోతరా ఏంది? పాపం పాడుగాను . 
ఏంది శెల్లె! ఎవల సంగతి శెప్తున్నవు? ఏం జరిగింది?
ఇంకెవలక్క. మన అప్పయ్య బావ సంగతే. గాయన అమాయికత్తం జూసి ఆత్తి పంపకాలల్ల అన్నదమ్ములు అన్నేలం చేసిండ్రు.ఎందుకిట్లని వొదిన అడిగితే.ఆడోళ్ళ  పెత్తనం ఎక్కువైందని లొల్లి లొల్లి జేసిండ్రంట. పాపం ఏం తాను మాత్తరం ఏం జేత్తది. కిమ్మనకుండ ఉండి పోయింది.
 గిదంత గా బావోళ్ళూ ఏరుబడ్డప్పుడేగా జర్గిందిగా మల్లెందుకు యాజ్జేత్తున్నవు శెల్లె.
 యాజ్జెయ్యక పోదుని గని పొద్దత్తమానం వొదిన్ని ఏదో ఒక మాటనుడట.యినీ యినీ శెవులు శిల్లులు పడ్డట్టయి అయితయిందని "మీరు ఎందుకట్ల గాయి గాయి సేత్తుర్రు. మా మానాన మమ్మల్ని బత్కనీయరా?" అందట."
 ఇంగ జూస్కో ఎన్నాళ్ళ నుంచి ఎదురు సూత్తుండ్రో "కలిగెర కయ్యం దింపర గంప" అన్నట్టు కయ్యానికి కాలు దువ్వి అన్రాని మాటల్తో ఏడ్పించిండ్రంటవ్వా!
 అయ్యో గట్లనా శెల్లె! లోకమెట్ల మారింది. సాటి మడిషిని ఓర్సే గుణం లేకుండ బోయింది. "మెత్తటోళ్ళని సూత్తే మొత్తబుద్ధయిద్ది" తీ!
నివద్దిగ జెప్పినవ్ అవ్వా? ఇంకో యిష్యం శెప్పాలె నిన్న పొలం తానకి పొయినప్పుడు. గెట్లు మార్శి ఉన్నయంట. అద్దులన్ని ఆగమాగం జేసిండ్రంట పక్క పొలపోళ్ళు.మనిషి మీద ఎగనెత్తుకు పోయిండ్రట.
" గిమ్మంటప్పుడు ఏం జెయ్యాలో తెల్వక గటు ఎవలికీ శెప్పుకోలేక,గిటు అవమానంతో కుళ్లి కుళ్ళి ఏడుత్తుందవ్వా!
గందుకే అంటరు శెల్లె"అయినోడు కాలు దువ్వితే కానోడు మీద పడ్తడని"  గందుకే గాల్ల సంగతేందో తెల్వాలంటే పోలీసులకు ఫిర్యాదు శెయ్యాలె గా గాంగు గురించి పోలీసులు తెల్సుకొని మంచిగానే మర్యాద జేస్తరు.
అవునా అట్టా జేత్తెనే గాళ్ళు ఆట కట్టయిద్ది.
అవును శెల్లె 'ఇంటోడు ఈకన గొడితే బయటోడు తోకన గొడ్తడు " అని సుత అంటరు.
గదండీ సంగతి మంచికి రోజుల్లేవు. "అయినోడు కాలు దువ్వితే కాని వాడు మీద పడ్తడు అంటే గిదే మరి"ఎక్కడ జూషినా మనుషుల్లో కొందరు గిట్ల తయారైండ్రు.

కామెంట్‌లు