ఆయుధ కర్మాగారం ఉన్నత పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
 కంది

మండలంలోని ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాడు పదవ తరగతి విద్యార్థులు స్వయం పాలన దినోత్సవం జరుపుకున్నారు. పదవ తరగతి విద్యార్థులు సిబ్బంది గా మారి పాఠశాలను నిర్వహించారు. డీఈవోగా సాత్విక, ఎంఈఓ గా అబ్దుల్లా, ప్రధానోపాధ్యాయురాలుగా అలేఖ్య, పీడీలుగా ఇమాముద్దీన్, స్రవంతి, ఉపాధ్యాయులుగా మమత, ప్రియదర్శిని, అయేషా బేగం, నర్సింగ్ బేగం, అక్షిత, సంజన, అరవీన్, పావని, సృజన, హిమబిందు, అవినాష్, మనోజ్ కుమార్, షర్మిల పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని పాఠశాల హెచ్ఎం జయంతి వాణి, ఉపాధ్యాయులు రవీందర్, సుభాన్ సింగ్, శ్రీనివాస రావు, సంధ్య, సలోమి పర్యవేక్షించారు.
కామెంట్‌లు