మూలాలను విస్మ రిస్తే ఎలా...!?! ; - కోరాడ నరసింహా రావు!
పను లేవైనా చేయును చేతులు.... 

 ఎక్కడి కైనా చేర్చును కాళ్ళు... 
  దృశ్యములను చూపిం చును కళ్ళు... 
  శబ్ధములను వినిపించును చెవులు... 
   వాసనలను పసి గట్టు ను ముక్కు.... 
   అలసట ఎరుగని మిల్లె మననోరు... 

రుచులను తెలుపును నా లుక... 
బయటి నుండి లోపలి ప్రపంచ మునకు 
పదార్ధ ములను పంపుటె కాదు, 
మాట, పాటకు మూలము గొంతు... 

స్పర్శ జ్ఞానము నిచ్చును చర్మము ...

చెడు రక్త మంతయు సేకరించి... గుండెకు పంపుతు... 
  గుండె నుండి మంచి రక్త మును అవయవము లన్నిటికీ చేర్చు చున్నవి నరములే...! 
 
ఊపిరి తిత్తులు,ప్రాణ వాయువును శ్వాసిం చుటె కాదు...చెడు రక్తమును... 
మంచిగ మార్చును...! 

మన పేగులు, నరములు మల ద్వారము ఎనలేని సేవలను  చేయు చున్నవి ! 

సంతానమునకు సహకరించెడివి  మన మర్మాంగములే....! 

లబ్ డబ్ లబ్ డబ్ శబ్ధముతో.... 
  చెడు నటు మంచినిటు పంపుతూ.... 
  అను క్షణము శ్రమించు చున్నది మన గుండె..! 

స్వీక రించిన పదార్ధ ములన్ని పచనము గావించి... 
  రక్త వృద్ధి , ఇంద్రియ పుష్టి    గావించు చున్నది మన పొట్ట...! 

మాలిన్యములను వడకడు తున్నవి కిడ్నీలు

వీటన్నిటినీ సమన్వయిం చి, సక్రమముగ నడిపించేది... మన మెదడే...!! 

ఇన్ని యంత్రాలతో  సంస్థలను వ్యవస్థీ కరించి... 
సమన్వ యించి సృష్ఠించిన 
ఈ మానవ మహా యంత్రాన్ని 
మించినది ఈ సృష్ఠిలో వేరేదైనా ఉందా !? 

సైన్సుతో  మనిషి....ఎన్నో కని పెట్టినా... 
 అవన్నీకనిపెట్టినది కూడా ఈ మనిషే గా...! 

మనిషి తనలాంటి రోబో ను సైతం కని పెట్టినా.... 
 మనిషి తో సాటి రాలేడు గా...!! 

సై న్సు గొప్ప.... మనిషి గొప్ప అని వాదించే వారు
 ఆ దైవ శక్తి యొక్క గొప్పతనాన్ని ఎందుకు ఒప్పుకో లేరు...!! 
  వారి నాస్తిక పిడి వాదం ఓడి పోతుందన్న భయం!

మనిషి ఎన్ని ఘన కార్యా లు సాధించినా.... 
  మూలా లను విస్మ రిస్తే ఎలా....?!? 
      *****
కామెంట్‌లు