బిసిలెంతో వారికంత వాటా దక్కాలి

 మన దేశానికి  స్వాతంత్య్రం వచ్చి  ఇన్నాళ్ళు అయిన బి.సి లు వెనుకబడి పోయారనీ, ఇంకా రాజ్యాధికారం రాలేకపోయిందనీ, ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో కూడు, గూడు,  గుడ్డలు సరిగా లేని కుటుంబాలు కోకొల్లలు అనీ , పేదరికాన్ని అనుభవిస్తున్నారనీ, బిసిలు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లోనూ, ఉద్యోగాల్లోను , వ్యాపార,ఉపాధి రంగాల్లోనూ అన్నింటిలో వాటా దక్కాలి అని తెలంగాణ బిసి లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. వాసరవేణి పర్శరాములు అన్నారు. శనివారం  ప్రభుత్వ జూనియర్ కళాశాల యెల్లారెడ్డిపేటలో తెలంగాణ బిసి లెక్చరర్స్ అసోసియేషన్ న్యూ క్యాలెండర్ను ఆవిష్కరణ చేసారు. 
        ఈసందర్భంగా టి.జి.బి.సి.ఎల్.ఎ ఉపాధ్యక్షులు డా వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ ఉత్పత్తి కులాల్లో బిసిలు అధికంగా ఉన్నారనీ, బిసి జనగణనను చేపట్టాలనీ, బిసి లో వాటా తేల్చాలని, దేశవ్యాప్తంగా బిసిలు అన్ని రంగాల్లో తమ వాటాను కోల్పోయారనీ, ఉద్యోగుల ప్రమోషన్లలో అన్యాయం జరిగిందని, బిసిలు రాజ్యాధికారంతోనే న్యాయం జరుగుతుందని ఏకం కావాలని అన్నారు.
          అధ్యాపకులు క్యాతం సత్యనారాయణ,వాసరవేణి పర్శరాములు,మాదాసు చంద్రమౌళి, బుట్ట కవిత, జి.శ్రీను, అనుముల రవిచంద్ర, వెల్దండి సౌమ్య , అగోలం గౌతమి తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు