జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట విద్యార్థులు 60 మంది విద్యార్థులచే రచించబడిన కవితా సంపుటి "గునుగుపూలు" పుస్తకం లింగన్నపేట పాఠశాలలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,
శ్రీ సంటి గంగారం గారు బాలసాహితీవేత్త పెందోట వెంకటేశ్వర్లు, వాసరవేని పరుశరాములు, తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యులు, బాల సాహితివేత్త, గరిపల్లి అశోక్ గారు, గ్రామ సర్పంచ్, పిట్ల ఎల్లయ్య గారు గ్రామపంచాయతీ పాలకవర్గం, పాల్గొని విద్యార్థుల కవితలను ప్రశంసించడం జరిగింది.
కవులు సమాజాన్ని మేల్కొల్పేవారని, సమాజంలో ఉన్న కుళ్ళును కడిగే సబ్బు వంటిది కవిత్వమని, కవులుగా మారే వారి ఆలోచన అత్యున్నతంగా ఉంటుందని, భవిష్యత్తులో మంచి ఆలోచనతో ఉత్తమ కవులుగా మారి, సమాజాన్ని మార్చే కవితలు రాయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంటి గంగారం మరియు వక్తలు పేర్కొన్నారు. అనంతరం కవిత పుస్తక సంపాదకులు పాఠశాల తెలుగు భాషోపాధ్యాయులు, శ్రీ ముత్యాల నరేందర్ గారిని మరియు శ్రీ కాలువ రాజయ్య గారిని, పుస్తక సమీక్ష చేసిన పర్స రిషిక లను అతిథులు అభినందించడం జరిగింది. అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి మరియు పుస్తక ముద్రణకు 1975-76 లో ఇదే పాఠశాలలో 10వ తరగతి అభ్యసించిన పూర్వ విద్యార్థులు పాల్గొని, ఆర్థిక సహకారం అందించి, పుస్తకావిష్కరణకు తోడ్పడటం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి