ఆయుధ కర్మాగారం ఉన్నత పాఠశాలలో శివలింగాల తయారీ పోటీ

 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మండలంలోని ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శివలింగాల తయారీ పోటీ నిర్వహించినట్లు తెలుగు  భాషోపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని విజేతలుగా ప్రకటించారు. మొదటి బహుమతి 8వ తరగతికి చెందిన హారిక, ద్వితీయ బహుమతి ఆరవ తరగతికి చెందిన మహిపాల్, తృతీయ బహుమతి ఏడవ తరగతికి చెందిన సారిక పొందారు. పాల్గొన్న విద్యార్థుల్ని, ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు రజిత, ఉపాధ్యాయులు రవీందర్, సంధ్య, సలోమి అభినందించారు.
కామెంట్‌లు