మహిళా.... ఓ మహిళా !ఎన్నాల కెన్నాలకు....ఎన్నెన్ని వివక్షలు...ఎంతటి అణచి వేత...ఎన్నెన్ని కష్టాలు...!ఎంత ఆరాటం, ఎన్నెన్నిపోరాటాలు...!క్షమయా ధరిత్రి అన్న నా నుడి అక్షర సత్యమేతల్లి !రాళ్లు, గోతులు, ముళ్ల దారుల నన్నిటినీ దాటు కుని...నీ నిజ స్థానాన్ని నువ్ చేరుకోటానికి ఎంత కాలం పట్టింది తల్లి..!!ఇన్నాళ్లకు నిన్ను నువ్వు నిరూపించుకో గలిగా వమ్మా...!ఐనా... యింకా.... నీ ఆడ తనాన్ని అలుసుగాతీసుకుని, నిన్ను అబలనుచేసి ఆడు కుంటున్నారు తల్లీ...!!యింకా... నిన్ను నువ్వు కాపాడు కోవడంలో....యింకా సమర్ధు రాలివి కావాలమ్మా....!జయహో మహిళా...!జయ జయహో మహిళా...!!*****
మహిళా.... ఓ మహిళా ! : - కోరాడ నరసింహా రావు !
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి