మూడు కళ్లుంటే ఏం లాభం
కళ్ళు మూసుకుని ఉంటావు
జుట్టుకు పోషణ లేదు
బట్టల ధ్యాసే లేని బైరాగివి
గొంతులోని మంటను
మొండిగ భరించు కఠినుడవు
విషం కక్కే పాములకు
ఇంపుగ ఆశ్రయమిస్తావు
కొమ్ములు తిరిగిన పశువులను
పసందుగ పోషణ చేస్తావు
ప్రాణులు నీటికి అల్లాడుతుంటే
గంగమ్మను బంధించుకున్నావు
భూదేవి తాపంతో మరుగుతు ఉంటే
నీవు మంచు కొండపై కూర్చున్నావు
చీటికి మాటికి కోపిస్తావు
చిన్న దానికే చిందులు వేస్తావు
ఏది ఎక్కువైనా ఊగిపోతావు
ఒళ్ళు మరచి గంతులేస్తావు
సొంత వారికే హాని చేసుకునే
దురుసు వాడివి దురభిమానివి
తన కోపమే తన శత్రువని తెలియని
తిక్క శంకరయ్యవు
కాకా పడితే కరిగిపోయే కరుడుగట్టిన నియంతవు
ఈ లక్షణాలున్న నీవు ఇంతకూ
నాయకుడివా..? ప్రతినాయకుడివా..?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి