అమ్మతనములో దాగిన అమృతభావన తెలుగు
కోటి నవ్వులు పొదిగిన తియ్యని అనురాగము తెలుగు
అరవిచ్చిన అందాల లోగిలిలో అభినయo తెలుగు
తియ్యని వసంత పరిమళాలు అద్దిన కమనీయo తెలుగు
పసిడి నవ్వుల్లో దాగిన పరిమళ పుప్పొడి తెలుగు
తుమ్మెద హోయల్లో దాగిన అద్భుతభావన తెలుగు
జగతి లోగిలిలో నిండిన పసందైన ప్రణయరాగము తెలుగు
రాధమ్మ మదిలో మెదిలే వేణుగానం తెలుగు
జగతి లోగిలిలో అద్భుతమైన దృశ్యo తెలుగు
తేనెలో దాగిన తియ్యoదనపు తియ్యదనము తెలుగు
జగతిలో వెలిగే నిత్య ఆణిముత్యపు వెలుగు తెలుగు
దేశభాషలందు లెస్సగా నిలిచిన చంధస్సుల రారాజు తెలుగు
కొమ్మల్లో దాగిన కోయిల కూతల్లే కమ్మనైన పరిమళo తెలుగు
యవ్వనపు గుండెల్లో రగిరే ప్రేమతత్వo తెలుగు
పువ్వుల్లో దాగిన నిత్య తళుకుల రారాణి తెలుగు
దేశభాషలందు సువర్ణభరిత చందనo తెలుగు
కోటి వెలుగులు నిండిన యువత బంగారు భవిత తెలుగు
ప్రతిమదిని ముద్దాడే అనురాగపు పందిరి తెలుగు
=====================================
ప్రముఖ రచయిత్రి
నూతన ప్రక్రియల రూపకర్త
ఉషోదయ సాహితీ ఫౌండేషన్
తిరుపతి జిల్లా భాకరాపేట
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి