అస్సాంలోని ఒక గ్రామంలో, ఏనుగుల గుంపు క్రమం తప్పకుండా పొలాలలోకొచ్చి పంటలను మేసి పోతున్నాయి.
ఒక అడవి ఏనుగు రోజుకు సగటున 25 కిలోమీటర్లు నడిచి 150 కిలోల ఆహారం తింటుందట.
కానీ లాక్‌డౌన్ సమయంలో పరిస్థితి తలక్రిందులైంది.
భారతదేశం అంతటా ఉద్యోగాలు కోల్పోయి లాక్‌డౌన్ సమయంలో ఆ నిర్దిష్ట గ్రామానికి తిరిగి వచ్చిన ప్రజలు ఏనుగుల మందను పోషించడానికిగాను ప్రత్యేకించి గ్రామ పంట పొలాల్లోనూ, అడవి మధ్య విడివిడిగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ఏనుగులు ఈ విషయాన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నాయి. తమకోసం చేస్తున్న సాగును మాత్రమే అవి తింటున్నాయి. అనంతరం ఎవరికీ ఏ ఇబ్బందీ కలగనివ్వక అడవికి తిరిగెళ్ళిపోతున్నాయి.
ఒకానొకప్పుడు గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపును తరిమికొట్టిన వారే ఇప్పుడు ఏనుగులను స్వాగతించడానికి, వాటికోసం సాగు చేస్తున్న వాటిని తినమని పాటలు పాడుతున్నారు.
ఈ విధానానికి మార్గదర్శకురాలైన ఒక మహిళ, 'మీరు ఏనుగులను ప్రేమిస్తే అందుకు జవాబుగా ఏనుగులూ మిమ్మల్ని ప్రేమిస్తాయి...' అని చెప్పారు.
ఇవి చాలా సరళమైన పదాలే. కానీ ఈ చర్యకు చూపిన చొరవ తర్వాత ఆ మాటలు వినడం వల్ల కలిగే ఆనందం వర్ణనాతీతం అని స్థానికులు అంటున్నారు.
ఈ చెప్పుకోదగ్గ మార్పు అస్సాంలోని పచ్చని ప్రకృతి దృశ్యాల మధ్యలో, కర్బి ఆంగ్లాంగ్ శ్రేణి విస్తరించి ఉన్న నాగావ్ జిల్లాలోని హతిఖులి - రోంగ్‌హాంగ్ గ్రామంలో నమోదైంది.
ఈ గ్రామం ప్రపంచానికే ఒక ఉదాహరణగా ఉంది. ఇక్కడ అడవి ఏనుగులు వ్యవసాయ భూములలో స్వేచ్ఛగా తిరుగుతాయి. ప్రజలు ఏ మాత్రం భయపడకుండా వాటి సమీపంలోనే తమ పనులు చేసుకుంటున్న దృశ్యం చూసితీరాల్సిందేనని పలువురి మాట.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి