శతాధిక బాల కవి సమ్మేళనం

 భావి కవులను తయారు చేయాలనే ఉద్దేశ్యంతో విద్యార్ధులలోని సృజనాత్మకతకు పదును పెట్టేందుకు పాఠశాలల్లో గత కొన్ని రోజులుగా కవితా కార్యశాలలు నిర్వహించి ఈరోజు 110 మంది విద్యార్ధినీ విద్యార్ధులచే శతాధిక బాల కవి సమ్మేళనాన్ని నిర్వహించాము.  ఈ కవి సమ్మేళనం 11 ఆవృతాలలో సాగింది. విద్యార్ధులంతా వివిధ అంశాలపై చక్కని కవితలు వినిపించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ నుండి సెక్టోరల్ అధికారులంతా హాజరై కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించారు. విద్యార్ధులను ప్రోత్సహించాలే గాని సాహిత్య రంగంలో మేము రాణించగలము అని నిరూపించారు.

కామెంట్‌లు