మిషన్ SSC లక్ష్యంగా జడ్.పి.హెచ్.ఎస్ మంబాపూర్‌లో పేరెంట్స్–టీచర్స్ సమావేశం: - వెంకట్ , మొలక ప్రతినిధి
 వికారాబాద్ జిల్లా: పెద్దేముల్ మండలం పరిధిలోని జడ్.పి.హెచ్.ఎస్ మంబాపూర్ పాఠశాలలో ఎస్ఎస్సి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని “మిషన్ SSC – 100% ఫలితాలు” లక్ష్యంగా పేరెంట్స్–టీచర్స్ మీట్ ఏర్పాటు చేయగా, భారీ ఎత్తున
11 గ్రామాల తల్లిదండ్రులు హాజరయ్యారు.
ప్రపంచ మాతృభాష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు KVM వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మాతృభాషపై మమకారం పెంచుకొని ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు. పాఠశాల సర్వతోముఖ అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని, ఈసారి ఎస్ఎస్సి ఫలితాల్లో మండల స్థాయిలో టాప్ సాధించాలని ఆకాంక్షించారు.ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు రాజకీయ నాయకులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా  ఆర్మీలోఉపాధ్యాయులుగా పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగాలు సాధించారు వారిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలని సమాజానికి ఉపయోగపడాలన్నారు
మంబాపూర్ గ్రామ సర్పంచ్ భార్గవి శ్రీనివాస్ మాట్లాడుతూ పరీక్షలకు తక్కువ సమయం ఉన్నందున ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.పాఠశాలలో క్రమశిక్షణ దేశభక్తి పెంపొందించాలనిపరీక్షల వరకు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని  విద్యార్థులకు సూచించారు విద్యార్థులు తయారుచేసిన టిఎల్ఎం ని పరిశీలించారుజనగామ గ్రామ సర్పంచ్ అరుణ ఎస్ ఎస్ సి లో 500 పైగా మార్కులు వచ్చిన వారికి 11000 నగదు అందజేస్తానన్నారు 
ఈ సమావేశంలో ఉపాధ్యాయులు సబ్జెక్ట్‌వైస్ రివ్యూ నిర్వహించారు. పాఠశాల జిహెచ్ఎం శ్రీనివాస్ టీచర్స్ ,నూతనంగా ఎన్నికైన
సర్పంచులను సన్మానించారు. అనంతరం వికారాబాద్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాల బృందం చేత పాలిటెక్నిక్ అడ్మిషన్ పోస్టర్ని ఆవిష్కరించారుజనగాం అరుణ, రుక్మాపూర్ బాలరాజు, రేగొండి అశోక్ కుమార్, మారేపల్లి తండా సర్పంచ్‌లు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్‌పర్సన్ పావని, 11 గ్రామాల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మోహన్ ,ఆనందం ,సుధాకర్, శేఖర్, ఆంజనేయులు, 
నిర్మల ఎన్ నిర్మల
యాదమ్మ మమత స్వరూప విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో సాగి, ఎస్ఎస్సి ఫలితాల్లో 100% విజయాన్ని సాధించాలని అందరూ సంకల్పించారు.

కామెంట్‌లు