సముద్రగుప్తుడు 26: - ...అచ్యుతునిరాజ్యశ్రీ

 పాటలీపుత్రం వారణాసి వైశాలి ఉజ్జయిని ఇంకా చాలా ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా వచ్చారు వర్తక శ్రేష్టులంతా ఆహార వసతులు సమకూర్చారు హరిశేనుడు ఆ ఉత్సవాలపై అందంగా కవితల వెళ్ళాడు చంద్రగుప్తుని కీర్తిస్తూ రాసిన వాటిని ప్రజలు ఉత్సాహంతో చదివి ఆనందంగా కేరింతలు కొట్టారు పావు అర విలువైన దినార్ వెండి రాగి నాణ్యాలు విడుదల చేశారు హరి శేనుడు పాటలీపుత్ర మహామంత్రి మాత్రమే కాదు దండనాయకుడు కూడా యజ్ఞం ఆఖరి రోజు నగరమంతా కోలాహలంగా సందడిగా ఉంది జనాన్ని నియంత్రించే భారం చంద్రగుప్తునిపై పడింది మగధ నాగరికలు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు సామ్రాట్ సముద్ర గుప్తుడు పట్టపురాని శ్రీ దత్త రాణి చంద్రావతి రాకుమారులు రామగుప్త చంద్రగుప్తులు యాగానికి ఆహుతులు సమర్పించారు యజ్ఞ అశ్వాన్ని బలి ఇచ్చి ప్రసాదం పంచటం ఆపై విందు భోజనంతో యాగం పరిపూర్ణమైంది బ్రాహ్మణులకు వస్త్రాలు బంగారం దానంగా ఇచ్చారు అంతా రాజుని ప్రశంసిస్తూ ఇల్లు చేరారు రాత్రంతా గానా బజానాలతో పాటలు ఆనంద డోలికల్లో తెలియాడింది నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ సింహల దీప నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు హరిషేనుని కవితల్ని ఒక ధాతు స్తంభంపై చెక్కించే ఏర్పాటు సముద్రగుప్తుడు చేశాడు వసుబంధు అసెంగుడు బౌద్ధమతావలంబకులైన సముద్రగుప్తుని ఎంతగానో కొనియాడారు సామ్రాట్ దాదాపు శాకాహారి అని రక్తపాతం లేకుండా రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడని ఆ కవితల సారాంశం సముద్రగుప్తుడు కేవలం వీణ వాయించుటలోనే కాదు శ్రీకృష్ణ చరితను గ్రంథస్థం చేశాడని తెలుసుకున్న జనం ఆశ్చర్యంతో నోరావలించారు ఆయన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించారు తను అనుకున్నవన్నీ సాధించిన సముద్రగుప్తుని మనసులో ఏదో చిన్న అలజడి శంఖ పెద్దకొడుకు రామగుప్తుడు ఎందుకు పనికిరాని కొరకరాని కొయ్య గా మారాడని బాధ అందుకే అతనికి కబురంపాడు పెరిగిన గడ్డం స్నానం చేయకుండా పాచి మొహంతో లేచి వచ్చిన రామగుప్తుని చూస్తూనే సముద్రగుప్తుడు నీరు కారిపోయాడు🌹
కామెంట్‌లు