"ఆర్యావర్తసామ్రాట్! మహారాజాధిరాజా సముద్ర గుప్తులవారికి ఈదాసి తన సర్వస్వం అర్పిస్తోంది" అని అతనిపాదాలపై వాలిన ఆమెను మెత్తని పూలగుత్తిలా తన గుండెలకు హత్తుకొన్నాడు. ఆరాత్రివారికి వసంత రాత్రి ప్రతిగాలి పైరగాలిలా మారింది.ఆమె సాధారణ గణిక కాదు.పద్మినీజాతినాయిక.తనకలలరాణి.ఎప్పుడు తెల్లారిందో ఇద్దరికీ తెలీదు."సువర్ణా! నీవు వజ్రానివి, వెలకట్టలేని మాణిక్యానివి. " " ప్రభూ! ఈజన్మకిది చాలు.మీస్మరణతో నాజీవితం గడిపేస్తా.ఒకసామ్రాట్ గా పేరుప్రఖ్యాతులతో ఆచంద్రతారార్కం మీరు స్థిరంగా చరిత్ర లో నిలవాలి.దైవాన్ని ప్రార్థిస్తూ మన కలయికను మూడోకంటికి తెలియనివ్వను ప్రభూ!" కన్నీటితో అతని పాదాల్ని అభిషేకించి వీడ్కోలు పలికింది.ఆతని కన్నుల్లో నీరు నిలిచింది."ప్రభూ! ముందుగా మనం మహాకౌశలరాజ్యంపై (ఒడిసాలోనిరాయపూర్ పామల్లపుర్) దండెత్తాలి. అది జయించటం తేలిక. దానికన్నా చిన్న రాజ్యం మహాకాంతార. అక్కడి భిల్లులు బాణాలేయటంలో మహానేర్పరులు.వారికన్నా ముందుగా మనం రెండుజాతులవారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.బేత్వా పార్వతీ నదుల మధ్య అమీర్ జాతివారు,నర్సింహ గఢ్ వాసులైన ప్రార్జునులు...వీరిని అడ్డుతొలగించుకుంటే మనం ఆప్రాంతాల్ని జయించగలం. " హరిషేణుడు కూలకషంగా వివరిస్తే, "ముందుగా వారికి సందేశాలు పంపుదాం" అన్నాడు సముద్ర గుప్తుడు🌹
సముద్రగుప్తుడు28 ...అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి