హెచ్.ఎం.టి. ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంస్థ దుండిగల్ లో అభివృద్ధి చేసిన 5వ వెంచర్లో "మినీ కమ్యూనిటీ హాల్ మరియు ఎంట్రన్స్ ఆర్చ్" నిర్మాణానికి ఆదివారం కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కె.పి.వివేకానంద్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వివేకానంద్ మాట్లాడుతూ హెచ్.ఎం.టి. ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంస్థ హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో సుమారు 250 ఎకరాలు సేకరించి, 5 వెంచర్లను సమర్ధవంతంగా చేపట్టి దాదాపు 2,700 మంది సభ్యులకు ప్లాట్లు కేటాయించడం నిజంగా హర్షించదగ్గ విషయమని కొనియాడారు. త్వరలో 6 వెంచర్ కూడా చేపట్టి సిక్సర్ కొట్టాలని కోరారు.
6వ వెంచర్ కోసం హైదరాబాద్ ఎల్.బి.నగర్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర్ రోడ్డు సమీపంలోని తక్కెళ్లపల్లిలో ఒక సైట్ చూసినట్లు సంస్థ ఉపాధ్యక్షులు టి.వి.సత్యనారాయణ తెలియజేశారు. త్వరలో సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా 6వ వెంచర్ కోసం తగిన స్థలాన్ని ఎంపిక చేయనున్నట్లు సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
దుండిగల్ లో హెచ్.ఎం.టి. ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంస్థ సుమారు 47 ఎకరాల్లో దాదాపు 430 కి పైగా ప్లాట్లను అభివృద్ధి చేసి సభ్యులకు కేటాయించింది. కాలనీలో అన్ని ప్రాధమిక మౌలిక సదుపాయాలను దాదాపు పూర్తి చేయడం జరిగిందని సంస్థ కార్యదర్శి పండరి తెలియజేశారు. ఈ వెంచర్ స్థల సేకరణ సమయంలోనూ, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అనుమతుల విషయంలోనూ, అభివృద్ధి పనులు పూర్తిచేయడంలోనూ అడిగినప్పుడల్లా తమ అమూల్యమైన సమయం కేటాయించి ప్రోత్సహిస్తున్న శాసనసభ్యుడు కె.పి.వివేకానంద్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కాలనీలో పార్కులకు అవసరాలైన నీటి సౌకర్యం కోసం ఒక బోర్ వెల్ తో పాటు పైప్ లైన్ వేయించినట్లు సంస్థ డైరెక్టర్ తులసీదాస్ చెప్పారు. పార్కుల్లో వాకింగ్ ట్రాక్, బెంచీలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా నిర్వహించిన హెచ్.ఎం.టి. ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంస్థ సర్వసభ్య సమావేశానికి సంస్థ అధ్యక్షులు, హెచ్.ఎం.టి. కంపెనీ జి.టి.ఎం. షహీన్ అధ్యక్షత వహించి, గృహ నిర్మాణ సంస్థ చేపట్టే వెంచర్లకు గతంలో మాదిరిగానే హెచ్.ఎం.టి. కంపెనీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కోశాధికారిగా వ్యవహరిస్తున్న వికాశ్ కుమార్ గత ఏడాది ఆడిట్ చేసిన అకౌంట్స్ ను సభకు సమర్పించారు. కొంతమంది సభ్యులు తమ అనుభవాలు, సూచనలు, సలహాలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యుడు కె.పి.వివేకానంద్ తో పాటు స్థానిక నాయకులు కృష్ణ, శంకర్ నాయక్, సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ తదితరులను సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
చివరిగా సంస్థ డైరెక్టర్ అనంతరాములు వందన సమర్పణ అనంతరం పెద్ద సంఖ్యలో హాజరైన సభ్యులందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు.
***

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి