అంగరంగ వైభవంగా శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ
 ఖమ్మం, మామిళ్ళగూడెం లోని శ్రీ గాయత్రి భవనంలో ఖమ్మం జిల్లా నియోగి బ్రాహ్మణ స్వతంత్ర సేవ సంఘం నిర్వహణలో  శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగం ఆవిష్కరణ సభ జరిగింది.
ప్రముఖ ప్రవచన కర్త గోళ్ళమూడి సత్యనారాయణ శర్మ  శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కోసూరు ప్రసాద్ తోపాటు సభ్యులు వనం వెంకట అప్పారావు, చకిలం జనార్దన్, అయ్యదేవర రాంగోపాల్, రావులపాటి శ్రీనివాస్ రావు,  దేవులపల్లి హనుమంత రావు,  విన్నకోట సంతోష్ పాల్గొన్నారు.  
ఖమ్మం నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షలు మారంరాజు రాధాకృష్ణ, సభ్యులు శ్రీకాంత్, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం ఖమ్మం శాఖ అధ్యక్షులు సురవజ్జుల వాసు, 
వైదిక సంఘం అధ్యక్షులు ఆదిత్య సరస్వతి కుమార్, మహిళ నాయకురాలు పరిమి అనంత లక్ష్మి , వల్లూరు రంగారావు తోపాటు శంకరమఠం ధర్మాధికారి ఆమనిగంటి వెంకటరమణ, వైష్ణవ సంఘం ప్రతినిధులు,  ఖమ్మం లోని పలువురు బ్రాహ్మణ పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
🌸🌷🌸

కామెంట్‌లు