వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
52.శివ కామేశ్వరాంకస్థా (అష్టాక్షరీ)
53.శివా (ద్వ్యక్షరీ)
యాభై మూడవ నామ మంత్రము -
ఓం శివాయై నమః
శంభుని శరీరంలో సగభాగమును తనదిగా చేసుకుని, ఆ ఆది దేవుణ్ణి అర్థనారీశ్వరుణ్ణి చేసి, పరమేశ్వరి తానే శివుడై, సర్వమంగళయై, మంగళస్వరూపిణి గా దర్శనం అనుగ్రహిస్తున్న జగజ్జననికి నమస్కారము.
"శివా" అంటే ఈశానుని ఇచ్ఛా స్వరూపూరాలు. సృష్టి చేయాలి అనే కోరిక వామదేవునికి కలగడమే "ఇచ్ఛ". ఈ "ఇచ్ఛ" అనేది శక్తి. ఎటువంటి "శక్తి" అయినా ఆధారము లేకుండా ఉండలేదు. కనుక, అమ్మవారు పరమేశుని "ఇచ్ఛా స్వరూపూరాలు". ఇలా పరమేశ్వరుని ఇచ్ఛా స్వరూపూరాలుగా కనిపించిన లలితా పరాభట్టారిక ను చూచి వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "శివా" అని పిలిచి తరించారు.
సృష్టి చేయడానికి పూనుకున్న వృషభవాహనుడు, మనోవృత్తికీ, మనోవృత్తి రహితమైన స్థితికీ కూడా సాక్షి గా నిలుస్తున్నాడు. ఈ చరాచర జగత్తు అసత్యము. ఈ అసత్యమైన జగత్తుకు ఆధారంగా ఉంటూ, తానే నిత్యమూ, సత్యము అని ప్రకటిస్తున్నాడు సత్యస్వరూపుడైన "నంది వాహనుడు". పరమేశ్వరుడు స్వప్రకాశుడు, సర్వకాలసర్వావస్థలందూ అన్ని జీవులను ప్రేమించేవాడు. ఆ నీలకంఠునికి, రాక్షసులు, దేవతలు అని బేధం లేదు. అందరినీ సమానంగా చూసే స్థితప్రజ్ఞత చూపించి, తనచే సృష్టి చేయబడిన జీవులు అందరూ కూడా స్థితప్రజ్ఞతతో ఉండాలి అని చూపించారు.
శక్తి కి, శివుని కి అబేధము అనేది చెప్పేదే "అర్థనారీశ్వరము". జీవుడికి, ఈశ్వరునికి కూడా బేధము లేదు. అందుకే, పరమేశ్వరుడు, "శివుడు" అయ్యాడు. శివుడు మంగళ కారకుడు. ఆతని భార్య "శివా" అయ్యింది. ఈ "శివా" లో వున్న మంగళకరమైన గుణముల కారణంగా "సర్వమంగళ" అయ్యింది. సమస్త లోకాలలో ఉన్న అన్ని జీవులలో వ్యాపించి ఉన్నది వాయుదేవుడు. ఈ వాయుదేవుడినే, "ఈశానుడు" అని అంటారు. ఈ ఈశానుని భార్య "శివా". అందుకనే అన్నారు పెద్దలు, "ఏ జీవుడిలోనైనా "శక్తి" ఉంటే"శివం"; లేకపోతే "శవం" అని.
అగ్నికి వేడి లాగా, చంద్రునికి వెన్నెల లాగా, సూర్యునికి కాంతి లాగా, శివ పార్వతుల అనుబంధం విడదీయలేనిది. అందుకనే పరమేశ్వరి "శివా" అయ్యింది. అంతటి లలితా పరాభట్టారికను పూజించేటప్పుడు
ఓం శివాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి