వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
53.శివా (ద్వ్యక్షరీ)
54.స్వాధీన వల్లభా (అష్టాక్షరీ)
యాభై నాల్గవ నామ మంత్రము -
ఓం స్వాధీన వల్లభాయై నమః
ఆది యోగి అయిన ఆ మహాదేవుని భర్తగా పొందడమే కాకుండా, ఆయనను తన అధీనంలో ఉంచుకున్న శాంకరికి నమస్కారము.
శక్తి తో కలిసి వున్నప్పుడు మాత్రమే పరమేశ్వరుడు సృష్టి - స్థితి - లయ / తిరోధాన కార్యములను సక్రమముగా చేయగలుగుతాడు. కనుక శక్తి యొక్క అధీనంలో వున్నారు. ఆంటే, పరేశుడు స్వాధీన వల్లభుడు అయ్యారన్నమాట. అప్పుడు అమ్మ కూడా పరాధీనయే కదా! ఈ చరాచర జగత్తులో సర్వమూ "శివశక్త్యైక్యమే". ఇలా ఒకరికొకరు పరాధీనులైన శివ శక్తులను చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "స్వాధీన వల్లభా" అని పిలిచి తరించారు.
శ్రీ చక్రములో శివుడు "బిందు స్వరూపుడు". ఆ బిందువును చుట్టి వున్న త్రికోణాకారమే పరమేశ్వరి అయిన శక్తి. అంటే, బిందు రూపంలో ఉన్న స్వామివారిని త్రికోణ రూపంలో పరమేశ్వరి తన స్వాధీనంలో ఉంచుకున్నది అనేదే కదా. అందువలననే, జగన్మాత "స్వాధీన వల్లభా" అయింది.
శివుని ఇచ్ఛా శక్తి, పరమేశ్వరి కదా! అప్పుడు పరమేశ్వరుడు, పరమేశ్వరికి స్వాధీన వల్లభుడే కదా! అనగా నిర్ద్వంద్వంగా జగజ్జనని "స్వాధీన వల్లభా". పరమేశ్వరి యొక్క చింతామణి గృహం లో శివుడు నివాసం ఉంటాడు అని, కాళికా పురాణం లో చెప్పబడింది. అంటే, పరమేశ్వరుడు, పరమేశ్వరి అధీనంలో ఉన్నాడు. పరమేశ్వరుడు, శక్తి తనతో ఉండటం వల్లనే, ఈ చరాచర జగత్తు నిర్మాణం చేయగలిగాడు. పరమేశ్వరి అనే శక్తి తనతో ఉండకపోతే, శంకరుడు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేడు. సృష్టి - స్థితి - తిరోధాన కార్యక్రమాలు ఉండవు. తాను లేకపోవడం వలన, తన స్వామి నిష్క్రియాపరుడు అవకూడదు. కనుక, అమ్మ "స్వాధీన వల్లభా" అయ్యింది.
ఓ పరమేశ్వరీ! ఆయన పరాత్పరుడే! పరమశివుడే! కానీ, నీ అండ, తోడు ఉన్నప్పుడే సర్వశక్తిమంతుడై లోకకార్యములు అన్నీ చక్కబెట్టగలుగుతున్నాడు. నీ తోడు లేని నాడు, ఇసుక రేణువును కూడా కదపలేని అశక్తత కలిగి ఉంటాడు. అని ఆదిశంకరులు తాము రాసిన "సౌందర్య లహరి" లో అమ్మ గురించి చెప్పారు.
ఇలా లిలామాత్రంగా సకల సృష్టిని చేయగల పరమేశుని, తన సంపూర్ణ అధీనంలో ఉంచుకుని, సృష్టి - స్థితి - తిరోధాన కార్యక్రమాలు సరిగ్గా జరిగేలా చూస్తున్న లలితా పరాభట్టారికను పూజించేటప్పుడు
ఓం స్వాధీన వల్లభాయై నమః అని జపించాలి.
కొసమెరుపు ఏమిటంటే, పరాత్పరుడు, జగత్ప్రభువు స్వాధీన వల్లభుడైతే, మానవ మాత్రులం మనమెంత. ఒక ప్రాంతంలో ప్రాచుర్యం లో ఉన్నట్టు, "అందరమూ పాతూరి బుల్లెంకమ్మ తాలూకాయే!
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి