సాంప్రదాయాలను కాపాడుకోవటం కోసం పండుగలు చేస్తాము. సమాజానికి ఒక నిర్దిష్టమైన సందేశం ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తుంటాం. జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాల సందర్భంగా మన బాధ్యతను గుర్తు చేసుకుంటాం. ఏది చేసినా ప్రపంచ మానవాళి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం చేసే ఆరోగ్య అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగినది. సూక్ష్మజీవులు మనుషులను చంప గలగడం ప్రకృతి విచిత్రం. మానవ శరీరము బ్యాక్టీరియాలు, వైరస్ లు అనబడే ఎన్నో రకాల సూక్ష్మ క్రిములతో పోరాడుతూ ఒక్కోసారి క్రిముల దాడికి తట్టుకోలేక వ్యాధుల బారిన పడుతుంది.
మార్చి 24 ప్రత్యేకత: ప్రతి ఏటా మార్చి 24న టిబి గురించి ఆలోచించి, అవగాహన పెంచడానికి మన బాధ్యతలేమిటో తెలుసుకోడానికి ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం (వరల్డ్ టీబీ కంట్రోల్ డే) జరుపుకుంటాము. బ్యాక్టీరియా వల్ల వచ్చే క్షయ తీవ్రమైన అంటువ్యాధి. క్షయ వ్యాధి రావడానికి కారణమైనది మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా. ఈ సూక్ష్మక్రిమిని 24 మార్చి 1882 లో జర్మనీ దేశానికి చెందిన రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త మొదటిసారి కనుగొన్నాడు. అందువల్ల ఇదే రోజున ప్రతి ఏడాది ప్రపంచ క్షయ నివారణ దినంగా జరుపుకుంటున్నాము. క్షయ క్రిమిని కనుగొన్నందుకు రాబర్ట్ కోచ్ కు 1905లో నోబెల్ పురస్కారం కూడా లభించింది.
క్షయ అనగా : మన దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రజారోగ్య ప్రాణాంతక సమస్య క్షయ. ఇది స్త్రీ పురుషులకు ఎవరికైనా, ఏ వయసులోనైనా, శరీరంలో రక్త ప్రసరణ ఉన్న ఏ భాగానికైనా (తల వెంట్రుకలు, గోళ్లు తప్ప) రావచ్చును. క్షయ క్రిమికి ఆక్సిజన్ అవసరం కాబట్టి సాధారణంగా ఇది ఆక్సిజన్ ఎక్కువగా లభించే ఊపిరితిత్తులకు సోకుతుంది. దీన్ని శ్వాసకోస క్షయ (పల్మనరీ టీబీ) అంటారు. ఊపిరితిత్తులకు కాకుండా ఇతర శరీర భాగాలకు సోకే క్షయను ఎక్స్ట్రా పల్మొనరీ టీబీ అంటారు. ఇతర శరీర భాగాలు అనగా ఎముకలు, శోషరస కణుపులు, ప్లూరా, కీళ్ళు, కాలేయం, క్లోమం మొదలైన అన్ని అవయవాలకు సోకుతుంది. క్షయ అనగా క్షీణించుట ఈ వ్యాధి వల్ల శరీరం క్రమంగా క్షీణించిపోతుంది. క్షయ వ్యాది అనాది కాలం నుంచి అనేక సామాజిక , ఆర్ధిక ఇబ్బందులకు మరియు మరణాలకు ప్రధాన కారణమవుతుంది. మధుమేహ (షుగర్) వ్యాధిగ్రస్తులకు క్షయ వ్యాధి వచ్చే ప్రమాదం 2 నుంచి 8 రెట్లు ఎక్కువగ్గా ఉంటుంది. ప్రపంచ క్షయ వ్యాది గ్రస్తుల్లో దాదాపు 15 శాతం మధుమేహం కలిగి ఉన్నారు. క్షయ వ్యాధి కేసుల్లో మధ్యపానం, ధూమపానం చేసేవారిలో ఈ క్షయవ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఎయిడ్స్(హెచ్ఐవి), పోషకాహార లోపం ఉన్న వారు ఈ జబ్బు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
క్షయ వ్యాధి తీవ్రత: భారతదేశంలో ప్రతి 5నిమిషాలకు ఇద్దరు సగటున రోజుకి సుమారు 600 మంది, సంవత్సరానికి 2 లక్షల మందికి పైగా క్షయ వ్యాధితో మరణిస్తున్నారు. ప్రపంచంలోని ఐదో వంతు క్షయ కేసులు మన భారత్ లోనే ఉన్నాయి. ప్రతిరోజు దాదాపు 6000 మంది, ఏడాదికి 20 లక్షలకు పైగా క్షయ వ్యాధి బారిన పడుతున్నారు. ఒక నయంకాని క్షయ రోగి ద్వారా ఏడాదికి10 నుండి15మందికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది.
టీబీ.ఎలా సోకుతుంది?: క్షయవ్యాధి అత్యధిక జనసమ్మర్థం ఉన్న చోట్లలో, మురికివాడల్లో నివసించే వారిలో అధికంగా ఉంటుంది. క్షయ రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు టీబీ.క్రీములు సన్నని తుంపర్ల ద్వారా గాలిలోనికి వ్యాపిస్తాయి. ఈ తుంపర్లను ఆరోగ్యవంతులు పీల్చినప్పుడు వారికి క్షయ వచ్చే అవకాశం ఉంది.
క్షయ వ్యాధి లక్షణాలను గుర్తించడం ఎలా?: కేవలం దగ్గు ఒక్కటే టీబి లక్షణం కాదు. ఈ వ్యాధి ఉన్నవారికి రెండు వారాలకు మించి ఎడ తెరిపిలేని దగ్గు, సాయంత్రం పూట జ్వరం, ఆకలి మరియు బరువు తగ్గడం, ఉమ్మిలో తెమడ (కఫం) పడటం లేదా రక్తం పడటం, అలసట లేదా నీరసం ఛాతిలో నొప్పి, శారీరక ఆరోగ్యంలో ఆకస్మిక మార్పు వీటిలో ఏవైనా లక్షణాలు కనిపించినట్లయితే క్షయగా అనుమానించవచ్చు.
టీబీ జబ్బుని నిర్ధారించడం ఎలా?: టీబి. సోకిందేమోనన్న అనుమానం ఉన్న వారు దగ్గరలోని డిఎంసి.(డిసిగ్నేటెడ్ మైక్రోస్కోప్ సెంటర్) పరీక్షా కేంద్రాల ద్వారా మన రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ తెమడ (కళ్ళె) పరీక్షలు రెండుసార్లు (ఉదయాన్నే,అప్పటికప్పుడు) పరీక్షలుచేసి వ్యాధిని నిర్ధారిస్తారు. ఒకవేళ రెండుసార్లు పరీక్షలు నెగిటివ్ అయితే ఎక్స్ రే తీస్తారు. ఈ పరీక్షలన్నీ ఉచితంగా చేస్తారు. సిబి నాట్ పరీక్ష ద్వారా రెండు గంటల్లోనే క్షయ వ్యాధి తీవ్రతను నిర్దారించవచ్చు .
క్షయ వ్యాధి పూర్తిగా నయమవుతుందా? : మనదేశంలో 1962లో జాతీయ క్షయ వ్యాధి నివారణ కార్యక్రమం (ఎన్.టి.సి.పి.) ప్రారంభమైనప్పటికీ అనుకున్న ప్రగతి సాధించలేక పోయింది. తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ 1997లో “ప్రత్యక్ష పర్యవేక్షణ స్వల్పకాలిక చికిత్స (DOTS)” విధానాన్ని రూపొందించింది. దీన్నే డాట్స్ పద్ధతి అంటారు. ఈ డాట్స్ పద్ధతిలో శిక్షణ పొందిన ఆశా కార్యకర్తలు మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న క్షయ రోగులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ వ్యాధి దశను బట్టి ఆరు నెలలు లేదా ఎనిమిది నెలలు చికిత్సకు అవసరమైన మందులను తమ సమక్షంలోనే దగ్గర ఉండి మాత్రలను మింగించడం, వ్యాధి పూర్తిగా నయమయ్యేలా చూడటం ఈ విధానం ప్రత్యేకత. ఈ విధానం వల్ల క్షయ రోగులు తప్పకుండా సరైన మోతాదులో, సకాలంలో డాట్ ప్రొవైడర్స్ పర్యవేక్షణలో పూర్తికాలం మందులు వాడినట్లయితే వ్యాధి పూర్తిగా నయమవుతుంది. వీరు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. మద్యం సేవించడం, పొగతాగడం మానాలి.
ప్రధానమంత్రి టిబి ముక్త భారత్ : ప్రపంచలక్ష్యం 2030 కంటే ముందుగా భారత్ లో టిబి ని నిర్మూలించడం. టిబి కేసులను త్వరగా గుర్తించి, పూర్తిగా నయం చేసి,వ్యాప్తిని తగ్గించడం, నిక్షయ్ పోర్టల్ ద్వారా రోగుల ట్రాకింగ్ పోషకాహారం కోసం ప్రభుత్వ సహాయం అందించడం వంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం పనిచేస్తుంది.
క్షయ రోగి- కొన్ని జాగ్రత్తలు: క్షయ తీవ్రమైన అంటువ్యాధి. రోగి ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయరాదు. దగ్గు వచ్చినప్పుడు గుడ్డ నోటికి అడ్డం పెట్టుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మందులు వాడే సమయంలో రియాక్షన్ లాంటి వస్తే భయపడకుండా డాక్టర్ని సంప్రదించాలి. మందులు క్రమంగా వాడటం అతిముఖ్యం. వ్యాధి లక్షణాలు తగ్గినప్పటికీ మందులు మధ్యలో మానెయ్య కూడదు. వ్యాధిగ్రస్తులు ఉన్న ఇంట్లోనే 6 యేళ్ళ లోపు పిల్లలకు మందులు ఇప్పించాలి. కొత్తగా గుర్తించిన రోగుల చికిత్స కాలం ఆరు నెలలు (క్యాట్ 1). సరిగ్గా మందులు వాడకపోవడం వల్ల వ్యాధి ముదిరిన వారికి, ఒకసారి నయమై మళ్లీ వ్యాధి తిరగ బెట్టిన వారికి చికిత్స కాలం 8 నెలలు(క్యాట్2). మొండి ఎం.డి.ఆర్.టీబీ. (మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్) కి రెండేళ్ల చికిత్స అవసరమవుతుంది. ఈ మొండి ఎం.డి.ఆర్.టీబీ.కి కూడా పూర్తికాలం (రెండేళ్లు) మందులు వాడనట్లయితే వ్యాధి తీవ్రమై ఎక్స్.డి.ఆర్. టీబీ.గా మారి మరణానికి దారి తీస్తుంది. సాధారణంగా క్షయకు ఆరు నెలలు చికిత్స అవసరమైతే ఈ మొండి క్షయకు చికిత్స దీర్ఘకాలం పడుతుంది. క్షయ వ్యాధి రాకుండా నివారించడానికి పుట్టిన పిల్లలకు వెంటనే బి.సి.జి. టీకా వేయించాలి. క్షయరహిత ప్రపంచానికై చేతులు కలిపే నేతలు కావాలి. టీబీ.ని అంతం చేసే చరిత్ర సృష్టించాలి. వీలైనంత త్వరగా టీబీ.ని గుర్తించి క్రమం తప్పక డాట్స్ చికిత్సతో అనారోగ్య క్షయని మొగ్గలోనే తుంచివేయాలి. అప్పుడే టీబీ. ఓడిపోతుంది, భారత్ గెలుస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి