ఆనంద కేళి!: - డా పివిఎల్ సుబ్బారావు, విజయనగరం,-9441058797.
ఆనందం జీవితాన అందము! 

మనం దుఃఖానికి అందము! 

విచారం వెళ్ళగొట్టే సంబరము!

రంగుల పండుగ ఉత్సాహము! 

చిన్న పెద్ద పరమపారవశ్యము!

రంగులతడిసిన నిండైన దేహాలు!

 నింగినంటే జనబృంద గీతాలు!

జననయనానంద నృత్యాలు !    

మానవ సామరస్య సాక్ష్యాలు!

గడచిన హోలీ ,మనసున, 
నిలిచిన ఆనంద స్మృతి !

ఈ హోలీ,రాబోయే ,
హోలీకి ఆహ్వాన గీతి! 

మనసు మురిపెంగా, 
పురి విప్పి ఆడుతున్న నెమలి!

వయసు గొంతు విప్పి, పాడుతున్న కుసుమ కోమలి!

సొగసు మనిషి జీవితం,
 నిత్యం ఉన్న నవరసానందకేళి!
_________


కామెంట్‌లు