ఓం నర నారాయణ నమః
ఓం వర పారాయణ నమః
అని ఆ శ్రీహరి నీ ప్రార్ధించు
కని ఈ మురహరి నర్థించు !
ఓం శ్రీ ఓంకారాయణ నమః
ఓం గీతా పారాయణ నమః
విందాం అందాం మనందరం
కలసి జపిస్తే బహు సుందరం !
పాంచ జన్యమును ఊదండి
డమరుక దరువును వేయండి
అడుగుల భజనను చేయండి
ఆ స్వామి పల్లకిని మోయండి!
గాయత్రి మంత్ర బలంతో నేడు
సావిత్రి తంత్ర జలంతో ఈనాడు
దైవ ప్రార్థన అంతా ఒకటై చేద్దాం
దైవ సన్నిధికి కొత్త దారిని తీద్దాం !
మా కష్టాల పాపాలను తొలగించు
మా ఇష్టాల దీపాలను వెలిగించు
మాకు భోగభాగ్యాలను అందించు
మీ భక్తి భావాలలో ఇక బంధించు!
హరిహరి ఓం మా శ్రీ నరహరి ఓం
పురహరి ఓం మాశ్రీ మురహరిఓం
నీ గీతా గోవిందం అంతా వింటాం
అది మృదుమధుర గీతం అంటాం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి