బాబు జగ్జీవన్ రాం చంద్ర గ్రామములో పుట్టాడు
సామాజిక న్యాయంకై పోరాటం తలుపు తట్టాడు
కనీస వేతన చట్టాన్ని ప్రవేశపెట్టిన
దళిత నేత
హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన ప్రఖ్యాత !
వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినవాడు
స్వాతంత్ర సమరంలో నిలిచి గెలిచిన రేడు
భారత్.లో బాబుజిగా తాను ప్రసిద్ధుడు
సమ సమాజ స్థాపనకు తానాయే సంసిద్ధుడు !
హరిత విప్లవానికి శ్రీకారం చుట్టి
కుల రహిత సమాజ ప్రాకారం కట్టి
కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీని పెట్టి
జగత్ ప్రఖ్యాతి గాంచిన జగజెట్టి
స్వయం పోరాటం చేసి ఎదిగిన రాజకీయవేత్త
దళితుల పోరాటంలో చూపించెను తన సత్తా
ఆయన హృదయం నవనీతం కన్నా మెత్త
పోరు సల్పిన అందరికీ పంచె సమ న్యాయం బత్త !
పోరాటాలకు ఆయన ఓ వెన్నెముక
ఆరిపోని నిరంతరం మండే ఓ అగ్నిశిఖ
సేవారంగంలో చూపించను తన తడాఖ
గాంధీజీ నేతాజీలకు తానాయెను ప్రియ సఖ !
శోభిరామ్ వసంత దేవిల కుమారుడు
1986 జులై నెలలో అయ్యాడు అమరుడు
అమరుడైన బాబూజీ కి ఇవ్వాలి నివాళి
అంజలి ఘటించి చదువుదాం కావాలి !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి