అమెరికాలో వృద్దాశ్రమాలు
-------------------------------
సీనియర్ సిటిజన్స్ కీ, చిన్నపిల్లలకి, మహిళలకీ, శారీరకంగా మానసికంగా ప్రత్యేక అవసరాలు కలిగిన వారికీ అమెరికాలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం గమనించాము. ప్రతీచోటా వారిపట్ల ఎంతో ఉన్నతంగా, ప్రత్యేక అభిమానంతో వ్యవహరిస్తారు.
2018 మార్చి 26 వ తేదీ మద్యాహ్నం BIRMINGHAM దగ్గరలో సీనియర్ సిటిజన్స్ కోసం నిర్వహిస్తున్న GALLERIA WOODS ఆనే ఒక కమ్యూనికి వెళ్ళాను. రిసెప్షనిస్ట్ పేరు KEMISHIA. జర్నలిస్ట్, RadioNews Reader గా నన్ను పరిచయం చేసుకోగానే ఆమె ఎంతో ఆనందంగా పలకరించింది. అడగకుండానే ఆమె తనతో సెల్ఫీ తీసుకోమన్నారు. ఇక్కడ తెలియనివాళ్లకు ఫొటో తీయకూడదు.
సరే ఇక కమ్యూనిటీ విషయానికి వస్తే ఇది చాలా ప్రశాంతమైన వాతావరణంలో పెద్ద పెద్ద చెట్లు విశాలమైన పచ్చికబయళ్ళ మధ్య ఉంది. ఇక్కడ వృద్ధులకు పౌష్టికాహారం, వైద్యం, వ్యాయామం, Radio, TV, పుస్తకాలు మొదలయిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. వారు నివసించే ఇంటికి అద్దె కట్టవచ్చు లేదా స్వంతంగా కొనుక్కోవచ్చు.
అక్కడ ఒకామెను పలకరిస్తే 13 ఏళ్ళనుంచీ ఉంటున్నానని చెప్పారు. మరొకామె రెండు సార్లు అడిగితే కానీ - తన వయస్సు 86 సంవత్సరాలని చెప్పలేదు. ఆమె చాలా ఆరోగ్యంగా చురుకుగా ఉన్నారు. ఇద్దరు ముగ్గురు వృద్దులు వీల్ చైర్స్ లో అటు ఇటు తిరుగుతూ కనబడ్డారు. అందరూ ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారు.
ఇలా చూస్తూ, చూసిన ప్రతీదీ మీతో Share చేస్తూ పొతే - అన్నీ వింతగానూ విడ్డూరంగానే ఉంటున్నాయి.
🌸🌷🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి