తేనెల మాటల తీయని ధారల
తెలుగు పలుకులే పలికెదము
ఒకటి రెండు మూడు అంటూ
అంకెల గారడి నేర్చెదము!
అమ్మా నాన్న పిలుపులనే
ఇంటా బయటా అంటాము
తెలుగు వరసల పిలుపులతోనే
అందరినీ పిలిచెదము!
తెలుగు భాషలో ఉన్న పాటలు
కోయిల వలెనే పాడెదము
భాషకు కీర్తిని తెచ్చిన పద్యాలు
కంఠత పట్టీ మురిపిస్తాము!
ఆంగ్ల మాధ్యమం చదివితె ఏమి?
ఆంగ్ల భాషను నేర్చిన ఏమీ?
తెలుగును ఎపుడూ మరువముగా
మన తెలుగును ఎపుడూ మరువముగా!
తెలుగు భాషలో ఉన్న తీపిని
దేశాలకు వినిపించెదము
స్వరమున ఒదిగిన మాధుర్యాలు
మనదే మనదే అందాము!
అమ్మ భాషకు కమ్మని గెలుపుల
చిరునామాగా ఉందాము
జగతిలో వెలుగులు చిందే భాషా
మనదే మనదే అందాము
ఇక మనదే మనదే అందాము!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి