కావాలి! కావాలి!: - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
వెలిగే దీపంలా 
ఎదిగే వృక్షంలా 
మహిలో ఉపయోగము 
కావాలి జీవితము 

వీచే వాయువులా 
ప్రాకే పూతీగలా 
నలుగురికి ఆదర్శము 
కావాలి యువతరము 

పారే సెలయేరులా 
మెరిసే తారకలా 
అందరికి సహకారము 
కావాలి ఉత్తేజము 

విరిసే సిరిమల్లెలా
కురిసే చిరు చినుకులా 
అందరూ కావాలి 
సమైక్యత రావాలి 


కామెంట్‌లు