ఆణిముత్యాలు -అక్షర సత్యాలు : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
అడుగు ముందుకేస్తుంటే 
తగ్గుతుంది దూరమే 
బాధలు పంచుకుంటే 
తరుగుతుంది భారమే 

చిరునవ్వులు చిందిస్తే 
పెరుగుతుంది అందమే 
చేయి చేయి కలిపితే 
వర్ధిల్లును స్నేహమే 

నమ్మకమే లోపిస్తే 
బలహీనమగు బంధమే 
బద్ధకం ఆవహిస్తే 
అభివృద్ధిక శూన్యమే 

ప్రతీకారం పెరిగితే 
జరుగుతుంది నష్టమే 
క్షమాగుణం వీడితే 
అడుగడుగునా వైరమే 


కామెంట్‌లు