పసి పిల్లలు పరమాత్ములు : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
పసి పిల్లల చిరునవ్వులు 
విరబూసిన మరుమల్లెలు 
పరిమళాలు వెదజల్లే 
అందమైన కుసుమాలు 

చిన్నారుల హృదయాలు 
లేలేత గులాబీలు 
వారి చిన్ని నయనాలు 
ముద్దులొలుకే కలువలు 

పసి పిల్లల పలుకులే 
జంటితేనె ధారలే 
మనసులను కదిలించే 
కవీంద్రుల కవనాలు 

బాలల ఆలోచనలే 
సృజనాత్మకతకు గురుతులు 
చిన్ని చిన్ని నడకలే 
హంసమ్మ పోలికలే 


కామెంట్‌లు