*ప్రాస మంజరి*పద్యాలు: - డా. ధనాశి ఉషారాణి-నూతన ప్రక్రియను రూపకర్త-భాకరాపేట తిరుపతి జిల్లా

 శ్రమిస్తూనె సాధించండి జయమందండి
పట్టుదలతో ప్రయత్నిస్తూ సాధించండి
లక్ష్యం సాధించాలంటే   శ్రమిం చండి
గమ్యం చేరాలంటే సాధన చే యండి

ప్రయత్నిస్తే నే కదా ఫలిస్తుం దండి
శ్రమ లేకుండా ఏ విజయమూ రాదండి
ఫలితం రావాలంటే దీక్షతో పొందండి
సాధనచేయండి భువి సత్ఫల మందండి

హితము చేయండి ఇలలో మేలు పొందండి 
సహకరించండి భువి యశము మీ రందండి
తోడ్పాటునందించండి మేలు పొందండి
ఎల్లరకు మేలు చేయండి పేరు పొందండి
.

కామెంట్‌లు