యుద్ధనీడలో ఉగాది ఉషస్సు..!: - కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
 కొత్త మావిచిగురులు
రుచి చూసిన
కొమ్మల్లో కోయిలమ్మ
మధుర గానం విన్న
నేలమ్మ పచ్చని ఆశలా
ప్రాణం పోసుకుంటోంది...
"ఉగాది ఉషస్సు" చీకటిని చీల్చే 
సూర్యకాంతిలా ఉదయిస్తోంది...
అదిగో అటూ చూడండి
పశ్చిమాసియాలో పగబట్టిన పాములు
బుసలుకొడుతూ విషం గ్రక్కుతున్నాయి
కక్షల కారుమేఘాలు కమ్ముకున్నాయి
అగ్రరాజ్యం ఉగ్రరూపం దాల్చింది
నింగలో నిప్పుల వాన కురుస్తోంది
యుద్దవిమానాల్తో ధరణి దద్దరిల్లుతోంది..
అందుకే "ప్రపంచ శాంతి" కోసం...
ఆశతో...ఆహ్వానం పలుకుదాం...
పరాభవ నామ తొలి తెలుగు ఉగాది 
పర్వదినానికి స్వాగతం..! సుస్వాగతం..!
ఊరించే షడ్రుచుల
ఉగాది పచ్చడితో...
పంచాంగ శ్రవణంతో...
కవి సమ్మేళనాలతో...
రేపటి శాంతి స్థాపనకై
పాషాణ హృదయాలను కరిగించాలని...
లోకకల్యాణం కోసం...
కొమ్మల్లో కోయిలమ్మలతో కలిసి
"శాంతి గీతం" ఆలపించాలని...
ఆశతో...ఆహ్వానం పలుకుదాం...
పరాభవ నామ తొలి తెలుగు ఉగాది 
పర్వదినానికి స్వాగతం..! సుస్వాగతం..! 
కొత్త మావిచిగురులు
రుచి చూసిన
కొమ్మల్లో కోయిలమ్మ
మధుర గానం విన్న
నేలమ్మ పచ్చని ఆశలా
ప్రాణం పోసుకుంటోంది...
"ఉగాది ఉషస్సు" చీకటిని చీల్చే 
సూర్యకాంతిలా ఉదయిస్తోంది...

అదిగో అటూ చూడండి
పశ్చిమాసియాలో పగబట్టిన పాములు
బుసలుకొడుతూ విషం గ్రక్కుతున్నాయి
కక్షల కారుమేఘాలు కమ్ముకున్నాయి
అగ్రరాజ్యం ఉగ్రరూపం దాల్చింది
నింగలో నిప్పుల వాన కురుస్తోంది
యుద్దవిమానాల్తో ధరణి దద్దరిల్లుతోంది..

అందుకే "ప్రపంచ శాంతి" కోసం...
ఆశతో...ఆహ్వానం పలుకుదాం...
పరాభవ నామ తొలి తెలుగు ఉగాది 
పర్వదినానికి స్వాగతం..! సుస్వాగతం..!

ఊరించే షడ్రుచుల
ఉగాది పచ్చడితో...
పంచాంగ శ్రవణంతో...
కవి సమ్మేళనాలతో...
రేపటి శాంతి స్థాపనకై
పాషాణ హృదయాలను కరిగించాలని...

లోకకల్యాణం కోసం...
కొమ్మల్లో కోయిలమ్మలతో కలిసి
"శాంతి గీతం" ఆలపించాలని...

ఆశతో...ఆహ్వానం పలుకుదాం...
పరాభవ నామ తొలి తెలుగు ఉగాది 
పర్వదినానికి స్వాగతం..! సుస్వాగతం..! 


కామెంట్‌లు