మా అమెరికా అనుభవాలు..: - పోణంగి బాల భాస్కర్
 అమెరికా స్కూల్స్ లో పాఠాలకంటే ఆటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా చిన్న క్లాసుల పిల్లలకి బెంచీలు, డెస్కులు వంటివి వరుసగా పెట్టి class room లాగా ఉండదు. వాళ్ల అవగాహనా స్థాయిని బట్టి ప్రతి క్లాసు పిల్లలను బృందాలుగా చేసి విడివిడిగా వారికి కబుర్లు పాటలు ఆటలు కధలు చెబుతూ పాఠాలు చెబుతారు. రంగు రంగు పెన్సిళ్ళతో వారు గీసిన బొమ్మలపై వారి పేర్లు వ్రాసి, క్లాసు గోడలపై వరసగా అమర్చి పెడతారు. మా అమ్మాయి స్నేహితురాలి కొడుకు చదువుతున్న school కి వెళ్లాను. క్లాస్ కి వెళ్ళేటప్పుడు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు టీచర్ కి hug ఇస్తారు. స్కూలు ఓనర్ తల్లి క్లాసు రూమ్స్ లో చెత్త లేకుండా శుభ్రంగా ఉండేలా చూసే బాధ్యతను నిర్వహిస్తారు. తనను  ఎవరైనా పిల్లలు పలకరించి hug ఇస్తే వారికి ఆమె చాకోలెట్లు బిస్కట్లు ఇస్తారు. క్లాసు రూములను పిల్లలే పరిశుభ్రంగా ఉండేలా చూస్తారు. చెత్త బుట్టల్లో వేసిన చెత్తను పెద్ద క్లాసు పిల్లలు వంతుల వారీగా బయట ఉండే పెద్ద పెద్ద గార్బేజ్ టిన్స్ లొ వేస్తారు. 
ఆవిధంగా వారు చదువుతో పాటు పరిసరాల పరిశుభ్రతపై కూడా దృష్టి పెడతారు. ఇక్కడ మన పిల్లల్ని తప్ప వేరే పిల్లలను ముట్టుకోకూడదు, ముద్దుచేయకూడదు, అనుమతి లేకుండా ఫొటోలు తీయకూడదు. దూరం నుంచి చూడాలి అంతే. 
పేరెంట్స్ నీ  విజిటర్లను క్లాసు రూం లోకి కూడా అనుమతిస్తారు. వారు చదువు చెప్పే పద్దతుల గురించీ ఇతర ప్రవర్తనలకు సంబంధించిన విషయాల గురించీ తల్లిదండ్రులకు వివరించి అప్పుడప్పుడు వారికి తగిన శిక్షణ కూడా ఇస్తారు. చిన్న చిన్న టూర్స్ కి తీసుకువెళతారు. వాలంటీర్లుగా తల్లిదండ్రులను కూడా అనుమతిస్తారు. 
అందువల్ల ఇక్కడ పిల్లలు స్కూలు కు వెళ్ళడానికి పేచీలు పెట్టకుండా ఏడవకుండా శుభ్రంగా తయారై ఆనందంగా హుషారుగా నవ్వుతూ వెళ్తారు. అదీ సంగతి.
🌸🌷💐🌷🌸





కామెంట్‌లు