మా అమెరికా అనుభవాలు: - పోణంగి బాల భాస్కర్


 North Carolina లోని Grand Father Mountain పర్యటన విశేషాలు


2018 మార్చి 3వ తేదీ శనివారం మేము North Carolina నుండి 
Grand Father Mountain చూడడానికి వెళ్ళాము.   
ఉదయం 8 గంటలకు బయలుదేరి దారిలో అనేక కొండలు,
లోయల మధ్య నుంచి వాటి అందాలు తిలకిస్తూ 
107  మైళ్ళు కారులో ప్రయాణం చేశాము. 
నెమ్మదిగా 12 గంటలకు  Grand Father Mountain Entrance దగ్గరకు చేరాము. కారులో పైకి వెళ్ళడానికి ఒక్కొక్కరికి టిక్కెట్టు 
20 డాలర్లు.  అయితే ఆరోజు కొండ మీద గాలి వేగం ఎక్కువగా ఉండటం వల్ల Mile High Swinging Bridge దగ్గరకు ప్రవేశానికి అనుమతి లేదని చెప్పి ఒక్కొరికి 10 డాలర్లు మాత్రమే తీసుకున్నారు.  అయితే అతి ముఖ్యమైన  Swinging Bridge చూడలేక పోయినందుకు కాస్త నిరాశకు గురయ్యాము. 
టిక్కెట్లతో పాటు ఒక AUDIO TOUR CD, ఒక సమాచార పత్రం ఇచ్చారు. అందులో అక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి,
 తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలైనవి వివరంగా చెప్పారు. 
కొండ మీదకు 2.5 మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత 
Nature Museum దగ్గర కారు పార్క్ చేసుకుని చుట్టుపక్కల ప్రదేశాలు Museum, Auditorium, Animal Habitats చూశాము. 
ఈ కొండలు సముద్రమట్టానికి సుమారు ఆరు వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి.  కొంతదూరం పైకి వెళ్ళాక GPS పనిచేయదని ముందే తెలియడం వల్ల కొంత జాగ్రత్త పడడంవల్ల, అక్కడ ఇచ్చిన CD, Information, Route Map ఆధారంగా చూడవలసిన ప్రదేశాలను చూడగలిగాము. 
దారిలో అక్కడక్కడా కొండ పైనుంచి కిందకు జలపాతాలు కనిపించాయి. కొన్ని చోట్ల నీళ్లు గడ్డకట్టి దారాల్లా వ్రేళ్ళాడుతూ దర్శనమిచ్చాయి.  దారిలో అక్కడక్కడ కారు పార్క్ చేసుకునిప్రకృతి అందాలు తిలకించడానికి వీలుగా " Look Over " అని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.  కొన్ని చోట్ల దిగి ఫొటోలు తీసుకున్నాము.  అక్కడ టోపీలు, కెమెరాలే కాదు, మనుషులు కూడా ఎగిరిపోయేంత వేగంగా గాలి వీచింది. Blue Ridge Mountains  లో ఇది ఒక భాగం.  Blue Ridge  Park Way కొండలు మొత్తం మూడు నాలుగు రాష్ట్రాలను కలుపుతూ ఉంటుంది.  చలి తగ్గాక, చెట్లు అన్నీ చిగురించి, పుష్పించినప్పుడు, రంగురంగుల పువ్వులు, ఆకులతో ఈ ప్రదేశం చాలా రమణీయంగా ఉంటుందని చెప్పారు. 
తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది - అన్నట్లు మేము కొంచెం advance అయ్యాము.   ఆరుబయట చాలా చలిగా ఉన్నందువల్ల కారులోనే కూర్చుని ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం చేసాము.  ఆతర్వాత Mount Soma పై అమెరికన్లు నిర్మించిన శివాలయం చూసుకుని తిరిగి తిరిగి రాత్రి 9 గంటలకు ఇల్లు చేరుకున్నాము.
🌸🌸🌸
కామెంట్‌లు