"క"ళ్ళకు కట్టేట్టూ, కనువిప్పు కలిగేట్టూ అక్షరపు
"వి"త్తులతో, విషయాన్ని విశేషంగా, విస్మయంగా, వినిపించి, వివరించేట్టూ
"త"పించి, తరించి, తిలకించేలా
రాసే రచన కవిత
నేను ఓ కవితను..
నేను కవి చేతను..
కవి అక్షరాత్మను..
కవితాత్మకంగా వ్రాసే వ్రాతను..
అందరి భవితను.
అక్షరమై ఆలోచింపజేస్తాను..
ఆశను రేకెత్తిస్తాను..
ఆహ్లాదాన్ని అందిస్తాను..
ఆనందాలను పంచిస్తాను.
ఆలోచనలకు ఆయువును..
అభివృద్ధికి సాయమును..
ఆశాజీవుల గేయమును...
ఆర్తనాదాల స్వరమును..
అన్యాయాల అడ్డుకట్టను.
అవకాశాలకు అడ్డుపెట్టను..
అందరికీ ఆత్మీయుడును....
నేను మీ కవిని..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి