'ఊషన్నపల్లిలో ఘనంగా హోలీ సంబరాలు'

 పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ముందస్తుగా పాఠశాల పిల్లలు హోలీ సంబరాలు జరుపుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.   పిల్లలు రకరకాల రంగులను ఒంటిపై చల్లుకుంటూ, ముఖానికి పూసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ సంస్కృతీ, సంప్రదాయాలు మన దేశ వారసత్వ సంపదలని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పిల్లలు సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుంటూనే శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. పిల్లల ఆనందం, వారి మానసిక వికాసం కోసం ఇలాంటి వినూత్న కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహిస్తున్నామన్నారు.  తల్లిదండ్రులు తమ పిల్లల్ని డబ్బులు పెట్టి కొనుక్కునే చదువులు మనకొద్దని, సకల సౌకర్యాలతో నాణ్యమైన ఉచిత విద్యనందించే సర్కారు బడి చదువులే మేలని, అందువల్ల పిల్లలందరినీ ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చదివించాలని ఆయన తల్లిదండ్రుల్ని  కోరారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్,  ఉపాధ్యాయినులు మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, గోపిశెట్టి సుప్రియ, విద్యార్థినీ, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు