ఉగాది వేడుకల్లో కవితా గానం పోలయ్య కవికి సాహితీ సత్కారం
 సంగీత సాహిత్య సాంస్కృతిక సమన్వయ సమితి ఆధ్వర్యంలో మైన్స్ మాజీ డైరెక్టర్,వాల్మీకి మహర్షి సంస్థ గౌరవాధ్యక్షులు,డాక్టర్ విడి 
రాజగోపాల్ అధ్యక్షతన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం(19.03.2026)రాత్రి శ్రీ శారదా లైవ్ స్టూడియోలో ఘనంగా జరిగాయిఈ సందర్భంగా అరవా రవీంద్ర బాబు సమన్వయ కర్తగా నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొని హైదరాబాద్ అత్తాపూర్ నివాసి ప్రముఖ కవి రచయిత నటుడు పోలయ్య కవి కూకట్లపల్లి ...ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ వార్ఇతివృత్తంగా "తెలుగు ఉగాది ఉత్సవ గీతం"...అను కమ్మని కవితను ఆలపించి సభను అలరించారుపోలయ్య కవి కూకట్లపల్లిని డాక్టర్ విడి రాజగోపాల్ ఆత్మీయంగా సన్మానించగా కూకట్లపల్లి కృతజ్ఞతలు తెలియజేశారుఈ సభకు‌ ఆచార్య పద్మశ్రీ కొలకలూరి 
ఇనాక్ ముఖ్య అతిథిగా పాల్గొని...ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కవి సమ్మేళనాలను ఏర్పాటు చేసి ఎందరో ఔత్సాహికకవులను ప్రోత్సహిస్తూ ఒక "అభినవ రాయలు" లా డా విడి రాజగోపాల్ చేస్తున్న సాహితీ సేవలను కొనియాడారు ఇంకా సభలో 
డా.కోగంటి ఉషారాణి  విజయ రామరాజు సుబ్రహ్మణ్యం విజయలక్ష్మి తదితర  స్పాన్సర్లు పాల్గొన్నారు 
తదనంతరం అతిథులను, కవి సమ్మేళనంలో పాల్గొని కమ్మని కవితలు గానంచేసిన కవికోకిలలను ఘనంగా సన్మానించారు 
ఈ సభలో...సంగీత సామ్రాట్ 
టి శరత్ చంద్ర & టీం అరవా ఆపాత 
మధురాలను ఆలపించి అందరినీ 
ఉత్తేజపరిచారు . రుచికరమైన ఇంటి 
భోజనంతో సభ దిగ్విజయంగా ముగిసింది. 
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఒక తీపిగుర్తుగా మిగిలిపోయింది

కామెంట్‌లు