సంగీతం, నాట్యం,నటన వంటి సకల కళల సమ్మేళనం హరికథ అని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జంపాల వెంకటరమణ పేర్కొన్నారు. విశ్వామిత్ర సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం [22/03/2026] హథీరాంజీ కాలనీలోని చాంబర్ ఆఫ్ కామర్స్ లో నిర్వహించిన మూడు తరాల హరికథకులకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ హరికథలోని సందేశం ద్వారా సమాజం జాగృతం అవుతుందని వివరించారు.అధ్యక్షత వహించిన ప్రముఖ హరికథకులు డాక్టర్ వై. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హరికథ కళారూపాన్ని కాపాడుకోవడానికి భావితరాల వారికి అందించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జీవితానికి మార్గ నిర్దేశం చేసే అనేక అంశాలు హరికథలో ఉన్నాయని చెప్పారు.ఈ సందర్భంగా మూడు తరాలకు చెందిన హరికథకులు కే. వెంకట కృష్ణయ్య, మండూరి లక్ష్మీకుమారి, ఎం రాముడు, టీ.ఎం.రమ్యకృష్ణ, హెచ్.వెంకటరమణ,పావనశ్రీ లను సత్కరించి అభినందించారు. గౌరవ అతిథి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శరత్ బాబు మాట్లాడుతూ తన తండ్రి స్వర్గీయ బీవీ కృష్ణమరాజు స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి ఏడాది కొంతమంది హరికథకులను సత్కరిస్తామని తెలిపారు. ప్రముఖ రచయిత ఆర్. సి.కృష్ణ స్వామి రాజు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.ఎల్. నారాయణ, బి రమణ రాజు, సుదర్శన వర్మ,భూపతి రాజు, సీనియర్ జర్నలిస్ట్ జగదీష్, సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కే. సుబ్రహ్మణ్యం, గాయకుడు నాయని మధు తదితరులు పాల్గొన్నారు.
సకల కళల సమ్మేళనం హరికథ: - ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ఆచార్య జంపాల వెంకటరమణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి