సమయాలు -ఫలితాలు: - - యామిజాల జగదీశ్
పుస్తకాలతో గడిపిన సమయం
మనల్ని వెలుగులోకి నడిపిస్తుంది.

స్నేహితులతో గడిపిన సమయం
మన నుండి చింతలను దూరం చేస్తుంది.

పిల్లలతో గడిపిన సమయం
బాల్య పుటల్లోకి తీసుకెళ్ళి ఆనందాన్నిస్తుంది.

తల్లిదండ్రులను గౌరవంగా చూస్తూ  గడిపిన సమయం 
మనకు మధుర జ్ఞాపకాలను ఇస్తుంది.మంచిని పంచుతుందో

ఆలయంలో గడిపిన సమయం
మనస్సులోని మురికిని తొలగించి పవిత్రం చేస్తుంది.

వ్యాయామాలతో క్రీడలలో గడిపిన సమయం 
మనస్సుకీ, శరీరానికీ కలిపి బలాన్నిస్తుంది.
.
చెడు సహవాసాలతో గడిపిన సమయం 
నిశ్శబ్దంగా నరకానికి నడిపిస్తుంది.
.
చదువుసంధ్యలతో గడిపిన సమయం 
ఉత్తమ జీవితాన్ని ఇస్తుంది. 
.
కష్టపడి పని చేసిన సమయం 
ప్రతిఫలంగా సంపదను ఇస్తుంది. వృద్ధిలోకి తీసుకెళ్తుంది.
.
సోమరితనంలో గడిపిన గంటలు
జీవితాన్ని చీకటిలోకి నెట్టివేస్తుంది.
.
ఇలా ప్రతి వ్యక్తి జీవితంలోనూ వేర్వేరు సమయాలు ఉంటాయి.
.
ప్రతి వ్యక్తి జీవితం విలువైన సమయాన్ని 
గడిపే విధానాల ద్వారా రూపుదిద్దుకుంటుందనేది అనుభవజ్ఞుల మాట.


కామెంట్‌లు