నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కార గ్రహీత, బాలబంధు గద్వాల సోమన్న విరచిత 93వ పుస్తకం "చిరునవ్వు" పుస్తకావిష్కరణ గిద్దలూరు,ప్రకాశం జిల్లాలో ఘనంగా జరిగింది.సెయింట్ పాల్స్ విద్యా సంస్థల అధినేత గోనె ఆశీర్వాదం,వారి సతీమణి డి. వైలెటమ్మ, ఇంజనీర్ డా. పి. మనోజ్ కుమార్, ఆదోని అర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ యం. ఎల్. హరిప్రసాద్, రెవ. టి. జాన్ తిమోతి, సెయింట్ పాల్స్ విద్యా సంస్థల కరెస్పాండంట్స్ గోనె సుధాకర్,శ్రీకాంత్,రంజిత్, భాషాపాధ్యాయురాలు గోన గ్రేస్ రత్నప్రభ మున్నగు వారల చేతుల మీదగా ఆవిష్కరించడం విశేషం. అనంతరం ఈ పుస్తకమును గుండ్లూరు సుబ్రమణ్యం గారికి అంకితమిచ్చారు.పిదప బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీచర్ జి.సునీత, డా.పి.డయాన రంజిత,యస్. రిబ్కా మరియు ఆ విద్యా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.
గిద్దలూరులో కవి గద్వాల సోమన్న "చిరునవ్వు" పుస్తకావిష్కరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి