విద్యా రంగంలో సేవలకు డా. బండ రవిపాల్ రెడ్డికి గౌరవ డాక్టరేట్: వెంకట్ మొలక ప్రతినిధి

 హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, సిగ్మా ఐఏఎస్ వ్యవస్థాపకుడు , డైరెక్టర్ డా. బండ రవిపాల్ రెడ్డి గారికి విద్యా రంగంలో  సామాజిక సేవలో చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ (Honorary Doctorate in Education – Honoris Causa) ప్రదానం చేసారు . 
వెల్ ఎడ్యుకేషనల్ అండ్ పీస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రదానం చేసిన ఈ గౌరవ పురస్కారం, విద్యా రంగంలో ఆయన చూపిన నాయకత్వం, యువతకు అందించిన మార్గదర్శకత్వం, మరియు సమాజ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తిస్తూ అందజేసారు . 
డా. రవిపాల్ రెడ్డి గారు గత అనేక సంవత్సరాలుగా పోటీ పరీక్షల శిక్షణలో వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం అందిస్తూ, వారికి ఉద్యోగావకాశాలు  ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామీణ ,  పట్టణ ప్రాంతాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన పలు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా డా. రవిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ,“ఈ గౌరవం నాది మాత్రమే కాదు, నా తోడ్పాటుదారులది, నా ఫ్యాకల్టీ టీమ్‌ది, మరియు నా విద్యార్థులది. విద్య ద్వారా సమాజాన్ని బలోపేతం చేయడం నా జీవిత లక్ష్యం” అని తెలిపారు.ఈ గౌరవ డాక్టరేట్ పురస్కారం ఆయన విద్యా సేవలకు ఒక ముఖ్యమైన గుర్తింపుగా నిలిచింది.

కామెంట్‌లు