గుర్ల పాఠశాలల బాలికల ప్రతిభ

 స్థానిక క్షత్రియ పరిషత్ కల్యాణ మండపం సమావేశ మందిరంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు తేళ్ళ అరుణ, జిల్లా అధ్యక్షులు చివుకుల శ్రీలక్ష్మి, సహాయ కార్యదర్శి దాసరి పద్మ తదితరులు బాలికలకు కవి సమ్మేళనం నిర్వహించారు. ఉత్తరాంధ్ర మహిళా సదస్సులో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహించగా ఈ చిన్నారుల కవి సమ్మేళనం ఎంతో ఆదర్శవంతంగా సాగింది. ఇందులో పాల్గొన్న గుర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల బాలికల ప్రతిభను అభినందిస్తూ జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు, బొబ్బిలి రచనా సమాఖ్య అధ్యక్షులు మింది విజయమోహనరావులు బహుమతులను అందజేసారు. 
గుర్ల ఉన్నత పాఠశాల ఏడో తరగతి బాలిక నేరేడిబిల్లి మాధురికి ప్రత్యేక బహుమతిగా ఉపాధ్యాయ స్పూర్తి సంకలనాన్ని బహూకరించారు. అలాగే  ప్రశంసలు అందుకున్న అదే పాఠశాలకు చెందిన మరో ఏడుగురు బాలికలు మొయిద మీనాక్షి దేవి, కెల్ల చారుమతి, కిలారి హేమంతి కుమారి, బొంతు మౌనిక, బోడసింగి ఇందుశ్రీ, వాళ్ళ బిందుమాధవి, ప్రాథమిక పాఠశాల బాలిక బొంతు లోహితలకు కూడా బహుమతులను అందజేశారు. వీరంతా స్వర్ణమంటి భవిష్యత్తును పొందాలని కుదమ తిరుమలరావు, మింది విజయమోహనరావు తదితరులు  ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు