ఉ సురుసురంటూ,విసుగుతో
గా దెకింది పందికొక్కులా
ది వారాత్రాలు కంటిపై కునుకు కాజేసే నిన్ను ఎలా పిలవను?
అగ్నికీలల్లో దగ్ధమవుతున్న దేశాల్ని చూడాలని వస్తున్నావా
పరాభవా!?
విశ్వావసు నమ్మకద్రోహంతో
విశ్వాసం కోల్పోయింది
విశ్వమంతా అగ్నిగుండం
కూతలేదు కోయిలకి
పూతలేదు వేపకి
చేతగాక ప్రపంచం బిక్కమొహంతో చూస్తోంది
యుగాదికృత్ యుగావర్తో అంటూ విష్ణునామాలు జపిస్తూ
ఋతూనాంముఖోవసంతః
వేదవాక్యం వల్లిస్తున్నా
జేవురించినమొహం భీకరగుడ్లతో
తెంపరి రాక్షసుడే కానవస్తోంటే
నిన్ను ఎలా ఆహ్వానించను పరాభవా!?
మధు మాధవ మాసాలు మద్యంతో మాదకద్రవ్యాల
మదంతో మృత్యుకుహురాలవుతున్న వేళ
కల్తీ సరుకులతో ఉగాదిపచ్చడి
లొట్టలేస్తూ తినడానికి భయం
గరళకంఠుడిని కానుగా మరి!?
మత్స్యావతారం ఎత్తిన రోజా!?
కలుషిత జలాల్లో నీవెక్కడ?
తిట్లపురాణాలు ఆరోపణ ప్రత్యారోపణలే మా పంచాంగాలు
పరాభవానికే పట్టం కట్టే ప్రబుద్ధులకాలంలో
నీకు స్వాగతం చెప్పాలని లేదు
మారణహోమం ఆపితే
ఆలోచిస్తా! అప్పటిదాకా
ఉగం యుగం ఉగాది లేదునాకు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి