చౌధరి రాధాకృష్ణకు ఉగాది సాహితీ సింహా బిరుదు ప్రదానం

 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, గాంధేయవాది, బహుముఖ ప్రజ్ఞాశాలి చౌధరి రాధాకృష్ణకు, పలాస కాశీబుగ్గ జనజాగృతి సభ్యులు ఉగాది సందర్భంగా సాహితీ సింహా బిరుదు ప్రదానం గావిస్తూ సన్మానించారు. జనజాగృతి సాహితీ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో రాధాకృష్ణను ఈ సత్కారానికి ఎంపిక చేశారు. జన జాగృతి సంస్థ దశమ వార్షికోత్సవం కూడా ఇదే వేదికపై నిర్వహించగా ఆయన ఈ గౌరవాన్ని పొందారు. కాశీబుగ్గ గురుకుల విద్యాలయంలో ఈ ఉత్తరాంధ్ర కవిసమ్మేళనం నిర్వహించగా రాధాకృష్ణ పాల్గొని నేను స్వాప్నికుడిని అనే కవిత వినిపించి సభాసదుల ప్రశంసలు పొందారు. రాధాకృష్ణను సాహితీ సింహా బిరుదు ప్రదానం చేస్తూ పురస్కారాన్ని బహూకరిస్తూ జనజాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ డా.తెప్పల కృష్ణమూర్తి, అధ్యక్షులు డా.కుమార్ నాయక్, ముఖ్య అతిథి విశ్రాంత రిజిస్ట్రార్ బట్ట నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బండారు కాళిదాసు, డా.రాజ్ కూమార్, డా.టి.ఆనంద్, గురుకుల విద్యాలయం కరస్పాండెంట్ కింతల అశోకవర్ధన్ తదితరులు శాలువా, పుష్పం ఫలం కలం పొత్తం జ్ఞాపిక పుష్పమాల పగిడి ప్రశంసాపత్రాలతో ఘనంగా సన్మానించారు. గౌరవాధ్యక్షులు లఖినాన వెంకటాచలం, గౌరవ సలహాదారులు లయన్ ఎన్.అప్పారావు, బి.సుబ్బారావు, టి.మన్మథరావు, ఎం.లక్ష్మణరావు, పి.మల్లేశం, డా.జి.నాగేశ్వరరావు,  ఉపాధ్యక్షులు శ్రీనివాస బాబ్జి, సహాయ కార్యదర్శి బత్సల బాలరాజు, సాంస్కృతిక కార్యదర్శి భాష్యం రవికుమార్, సంగీత నృత్య శాఖల కార్యదర్శులు ఎం.ఉమామహేశ్వరి, జె.గజలక్ష్మి, టి.బాబూరావు తదితరులు పాల్గొన్నారు. రాధాకృష్ణ సాహితీ సింహ బిరుదు ప్రదానం పొందుట పట్ల పలువురు సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు