డా.రాణీ ప్రసాద్‌కు వంశీ గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డు

 ప్రముఖ బాల సాహితీవేత్త 56 పుస్తకాల రచయిత్రి డా.కందేపి రాణీప్రసాద్ సోమవారం  హైదరాబాద్‌లో ‘‘వంశీ గ్లోబల్ ఎక్స్‌లెన్స్’’ అవార్డును అందుకున్నారు. వంశీ ఆర్ట్ థియేటర్స్ వారు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా సాహితీ సాంస్కృతిక రంగాలలోని ప్రతిభామూర్తులకు ఆవార్డునిచ్చి సత్కరించారు. వంశీ ఆర్ట్స్ అధినేత వంశీ రామరాజు, తెలుగు విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ డా. వెలుదండ నిత్యానంద రావు, ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు, దూరదర్శన్ డైరెక్టర్ కామేశ్వరి  సాహితీ మూర్తులకు పురస్కారాలు అందజేశారు. డా. కందేపి రాణీప్రసాద్ రెండు వేల వ్యాసాలు, ఐదు వేల బొమ్మలు తయారుచేసి ఎనిమిది వరల్డ్ రికార్డులు అందుకున్నారు. బాలల కథలు 8 పుస్తకాలు, బాలల గేయాలు, 8 పుస్తకాలు, సైన్స్ పుస్తకాలు, 10 కళలకు సంబంధించి పది పుస్తకాలు రచించారు. రాణీప్రసాద్ తమ ఆసుపత్రి ద్వారా మాతృభాషను పరిరక్షిస్తున్నారు. బాలసాహిత్యంలో అనేక ప్రక్రియల్లో రచనలు చేసిన రాణీప్రసాద్ అనేక అవార్డులు అందుకున్నారు. సిరిసిల్ల కవులు, రచయితలు డా. కందేపి రాణీప్రసాద్‌ను అభినందిస్తున్నారు.
కామెంట్‌లు